AP Politics: రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దు.. జగన్‌కు ప్రొద్దుటూరు నేతల అల్టిమేటం
ABN , Publish Date - Jan 27 , 2024 | 09:41 AM
Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ప్రొద్దుటూరులో వైసీపీ కీలకనేత శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర వైసీపీ నేతలు సమావేశమయ్యారు.
కడప, జనవరి 27: ప్రొద్దుటూరు వైసీపీలో (YCP) వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Shivaprasad Reddy) తీరును వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ప్రొద్దుటూరులో వైసీపీ కీలకనేత శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దని జగన్ రెడ్డికి అసమ్మతి నేతలు అల్టిమేటం జారీ చేశారు.
జగన్ రెడ్డి ప్రొద్దుటూరులో రాచమల్లుకు మళ్లీ టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామని వైసీపీ అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని వ్యతిరేకత రాచమల్లుకు ఉందని.. ఆయనకు కాకుండా ఎవ్వరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు చెబుతున్నారు. కాగా.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శివచంద్రారెడ్డి, ఇర్ఫాన్ బాషలు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రొద్దుటూరు వ్యవహారంపై సీఎం జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది?.. అసమ్మతి నేతల అల్టిమేటంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.