టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:53 PM
గుర్రం కొండ పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మంగ ళవారం టీడీపీ గూటికి చేరారు.

గుర్రంకొండ, ఏప్రిల్ 23:గుర్రం కొండ పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మంగ ళవారం టీడీపీ గూటికి చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన ఆదినారాయణ, శంకర, రెడ్డిశేఖర్, పర్వేజ్ అహ్మద్, చింతిర్ల రాజా, సాములు నాయక్, మోహననాయక్, ఆనంద్, ప్రసాద్, అస్లాం, ఫారుక్, చలపతి, బాష, నయాజ్ అలీఖానతోపాటు మరొ కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. వీరందరికీ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నక్కా సతీష్‌కుమార్, నౌషాద్‌అహ్మద్, మూర్తిరావు, బాలాజి పాల్గొన్నారు.
పీలేరు నుంచి టీడీపీలో భారీగా చేరికలు
కలికిరి, ఏప్రిల్ 23: పీలేరు మండలంలోని యల్లమంద క్రాస్, కావలిపల్లె నుంచి సోమవారం రాత్రి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. నగరిపల్లెలోని కిశోర్‌కుమార్ రెడ్డి స్వగృహంలో వారంతా పసుపు కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. శ్రీనాథ రెడ్డి, నీళ్ళ రెడ్డెప్ప, విజయ్, హనీఫ్‌ల ఆధ్వర్యంలో కృష్ణ, చంద్ర, రమణ, శివ, సీఎం రమణ, హనుమంతు, రాంజీ నాయక్, మదనమోహన, సుబ్బ రాజు, రామాంజులు, రాజా రెడ్డి, వినోద్, సోనూ నాయక్, భారతమ్మ, భాస్కర, ప్రభాస్, రాఘవ, ఓబులేశు, వెంకట్రమణ నాయక్, నారాయణ, యోగ నాయుడు, మునిస్వామి, వెంకట్రమణ, జనార్ధన, రవి, నాగరాజు, రెడ్డెప్ప, హమీద్, సుబ్బమణ్యం, చిన్నబ్బ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.