Share News

Koneru Humpy: ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:49 AM

ప్రపంచస్థాయి చెస్‌ పోటీల్లో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ గెలుపొంది చరిత్ర సృష్టించారు.

Koneru Humpy: ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..
Koneru Humpy

హైదరాబాద్: ప్రపంచస్థాయి చెస్‌ పోటీల్లో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో ఆమె 8.5 పాయింట్లతో ప్రత్యర్థి అయిన ఇండోనేషియా ప్లేయర్ ఇరిన్ ఖరిష్మా సుకందర్‌పై ఆమె విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన పదకొండో రౌండ్‌లో కోనేరు హంపి గెలుపొంది భారత గౌరవాన్ని మరింత పెంచారు. 2019లో మాస్కో వేదికగా జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను సైతం కోనేరు సొంతం చేసుకున్నారు. కాగా, ఇది ఆమెకు రెండో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండుసార్లు నిలిచి కోనేరు హంపి రికార్డు సృష్టించారు.

Updated Date - Dec 29 , 2024 | 08:50 AM