పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ రంగులు తొలగించండి
ABN , Publish Date - Mar 09 , 2024 | 01:21 AM
గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 306 పోలింగ్ కేంద్రాల్లో మెజారిటీ భవనాలు, ఎంపీపీ స్కూళ్లు, హైస్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు వైసీపీ రంగులువేసి ఉన్నా యని వెంటనే వాటిని తొలగించాలని కృష్ణాజిల్లా రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మకు రాసిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చంద్ర శేఖర్‌కు గురువారం టీడీపీ నాయకులు అందజేశారు.

డీఆర్వో చంద్రశేఖర్‌కు టీడీపీ నాయకుల వినతి
హనుమాన్‌జంక్షన్‌రూరల్, మార్చి 8: గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 306 పోలింగ్ కేంద్రాల్లో మెజారిటీ భవనాలు, ఎంపీపీ స్కూళ్లు, హైస్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు వైసీపీ రంగులువేసి ఉన్నా యని వెంటనే వాటిని తొలగించాలని కృష్ణాజిల్లా రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మకు రాసిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి చంద్ర శేఖర్‌కు గురువారం టీడీపీ నాయకులు అందజేశారు. మచిలీపట్నంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాజకీయ పార్టీల వర్క్‌షాప్‌లో టీడీపీ గన్నవరం నియోజకవర్గ పోల్ మేనేజ్ మెంట్ కో-ఆర్డినేటర్ ఆళ్ల గోపాలకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ప్రతినిధి తంగిరాలశ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో రాజ కీయ పార్టీల గుర్తులు, బొమ్మలు ఉండకూడదని, కానీ గన్నవరం నియోజక వర్గంలోని మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి జగ న్‌ను కీర్తిస్తూ చిత్రపటాలు, వైసీపీ రంగులతో ఉన్నాయని వారు పేర్కొన్నారు. వాటిని తొలగించాలని గన్నవరం టీడీపీ- జనసేన అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే కలెక్టర్, సీఈవో, ఆర్వో, ఈఆర్వోలకు రాతపూర్వ కంగా తెలియజేసినా స్థానిక అధికారులు ఇంతరవరకూ స్పందించలే దని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అధికారులకు ప్రత్యేకంగా విన్నవిం చారు. తమ వినతిపత్రాన్ని పరిశీలించిన జిల్లా రెవెన్యూ అధికారి సాను కూలంగా స్పందించారని, సమస్యపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా మని హామీ ఇచ్చారని ఆళ్ల తెలిపారు. బత్తిన దాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.