Share News

AP News: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్

ABN , Publish Date - May 16 , 2024 | 09:18 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ రూట్ మార్చింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్‌గా ఉంది. ఆయా శాఖల్లో బిల్లుల కోసం కోర్టు ధిక్కార కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం పంపాలని తాజాగా ఆయా శాఖలకు రాత్రి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

AP News: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆర్థిక శాఖ (Finance Department) రూట్ మార్చింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్‌ (Silence)గా ఉంది. ఆయా శాఖల్లో బిల్లుల కోసం కోర్టు ధిక్కార కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం పంపాలని తాజాగా ఆయా శాఖలకు రాత్రి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. కోర్టు ధిక్కార కేసుల్లో ఉత్తర్వులు, నిధులు కోసం ఆగిపోయిన బిల్లులు, తాజాగా వేసిన పిటిషన్లు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి కోర్టు కేసులు ఆరు రకాల సమాచారం పంపాలని ఆదేశాలిచ్చారు.


బటన్ నొక్కిన పథకాలకు నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. ఇదే అంశంపై గవర్నర్‌ (Governor)కు టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ (Letter) రాశారు. ఈ మేరకు నిన్న (బుధవారం) టీడీపీ, బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. ప్రభుత్వ సొమ్ము ఎలా పడితే అలా వాడేందుకు వీలు లేదని గవర్నర్ చెప్పారు. ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. కాగా నిన్న ఉదయం 5 గురు కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించింది. ఈ అంశం కూడా గవర్నర్ దృష్టికి వెళ్లడంతో నిన్న మధ్యాహ్నం ఆయన ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!

నిద్రలోనే అగ్నికి ఆహుతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 16 , 2024 | 09:43 AM