Share News

AP Assembly: మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుడతా.. సభలో చంద్రబాబు ఎమోషనల్

ABN , First Publish Date - Jun 22 , 2024 | 10:30 AM

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ ప్రారంభమైంది.

AP Assembly: మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుడతా.. సభలో చంద్రబాబు ఎమోషనల్
Ayyannapatrudu

Live News & Update

  • 2024-06-22T13:42:20+05:30

    శాసనసభ వాయిదా

    • ముగిసిన ఏపీ శాసనసభ సమావేశాలు

    • రెండు రోజులపాటు జరిగిన 16వ శాసనసభ తొలి సమావేశాలు

    • శాసనసభను నిరవధిక వాయిదా వేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

  • 2024-06-22T13:39:03+05:30

    సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

    • రాష్ట్ర అభివృద్ధి కోసం శాసనసభ్యులు పనిచేయాలి

    • ప్రజల కోసం శాసనసభ్యులు పనిచేయాలి

    • ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి

  • 2024-06-22T13:35:31+05:30

    సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

    • స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నమస్కారాలు

    • గతంలో ఎంతోమంది పెద్దలు స్పీకర్‌గా పనిచేశారు

    • సభాపతులుగా చేసిన వాళ్లంతా విలువలతో సభను నడిపించారు

    • 42 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను

    • 22 మంది మహిళలు ఈ శాసనసభలో ఉన్నారు

    • 30 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్స్, 39 మంది గ్రాడ్యుయ్యేట్స్ సభలో ఉన్నారు

    • యువకులు ఈ శాసనసభలో ఉన్నారు

    • సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలి

    • ప్రజలు ఎమ్మెల్యేగా పదవులు ఇవ్వలేదు.. బాధ్యతను అప్పగించారు

    • ఎమ్మెల్యేలంతా తప పదవిని బాధ్యతగా భావించాలి

    • కొత్త ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తా

    • సభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి

    • సభలో గొప్పలు, పొగడ్తలు కాదు ప్రజల కోసం మాట్లాడాలి

    • మొదటిసారి ఎమ్మెల్యేల్లో 9మందికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చారు

    • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా పనిచేయాలి

    • అవసరమైతే సభ జరిగే రోజులను పొడిగిద్దాం

    • నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం

    • ప్రజల సమస్యలను సభలో ఎలా ప్రజెంట్ చేయాలనేది చాలా ముఖ్యం

    • కొత్త శాసనసభ సభ్యులు సభా మర్యాదాలను నేర్చుకోవాలి

    • సభలో ప్రశ్న ఎలా అడగాలనేది నేర్చుకోవాలి

    • అసెంబ్లీలో లైబ్రరీ ఉంది.. అవసరమైతే సభలో సభ్యులు కొత్త విషయాలు నేర్చుకోవాలి

    • సభ్యులు ఏ అంశాన్ని ఎలా సభలో లెవనెత్తాలో నిబంధనలు ఉన్నాయి.

    • నిబంధనల ప్రకారం సభ్యులంతా నడుచుకోవాలి

  • 2024-06-22T13:25:42+05:30

    సభలో టీడీపీ ఎమ్మెల్యేలు

    • విశాఖపట్టణం జిల్లా నుంచి స్పీకర్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి అయ్యన్నపాత్రుడు- చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు

    • ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అయ్యన్నపాత్రుడు తన వంతు పాత్ర పోషించాలి-చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు

    • అయ్యన్నపాత్రుడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం- నక్కా ఆనందబాబు, వేమూరు ఎమ్మెల్యే

    • విపక్ష వైసీపీ సభ్యులు సభలో లేకపోవడం దురదృష్టకరం-నక్కా ఆనందబాబు, వేమూరు ఎమ్మెల్యే

    • సభా మర్యాదలను కాపాడతాని చేసిన ప్రమాణాన్ని మరుసటి రోజే జగన్ తప్పారు-నక్కా ఆనందబాబు, వేమూరు ఎమ్మెల్యే

  • 2024-06-22T13:17:35+05:30

    సభలో ఎమ్మెల్యేలు..

    • స్సీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు

      సభలో విష్ణుకుమార్ రాజు, విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే

    • అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన పార్టీలకు అభినందనలు

    • అయ్యన్నపాత్రుడి నోరు కట్టేసినట్లైంది

    • విపక్ష వైసీపీ సభలో లేకపోవడం దురదృష్టకరం

    • వైసీపీ ప్రభుత్వంలో అయ్యన్నపాత్రుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు

    • అయ్యన్నపాత్రుడి కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు

    • వైసీపీ సభ్యులు ఈరోజు మాత్రమే సభకు రాలేదా.. ఇక ఐదేళ్లు రారా..

    • సభలో ప్రతిపక్షం లేకపోవడంతో తనకు మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి

    • నన్ను ఎంపీగా వెళ్లమంటే వెళ్లకుండా అసెంబ్లీకి వచ్చా

  • 2024-06-22T13:00:38+05:30

    సభలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు

    • అయ్యన్నపాత్రుడు మంచి మిత్రుడు

    • సుదీర్ఘకాలం కలిసి రాజకీయాలు చేశాము

    • మాది 1983 బ్యాచ్.. అందులో అయ్యన్నపాత్రుడు ఉన్నారు

    • రాజకీయ జీవితంలో ఎన్నో సభలు చూశాం

    • గత ఐదేళ్లు శాసనసభను చూడలేకపోయాం

    • ఏదైనా సభలో ప్రశ్నకు జవాబు ఉంటుంది

    • గత ఐదేళ్లలో ప్రశ్నకు జవాబులు లేవు.. ప్రశ్నకు ప్రశ్న వేసే ఘటన గత ఐదేళ్లలో చూశాం

    • విపక్ష వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోయడమే.

    • వైసీపీ సభ్యులు హుందాగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లారంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు

  • 2024-06-22T12:55:04+05:30

    సభలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

    • సభలో ప్రతిపక్షం లేదు

    • గత ఐదేళ్లు రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగింది

    • గత ప్రభుత్వ అరాచకపాలన కారణంగా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారు

    • గ్రామీణాభివృద్ధి గత ఐదేళ్లలో మందగించింది

    • అందరినీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

    • ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం మాట్లాడే అవకాశం సభ్యులకు ఇవ్వాలి

    • గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై ఏర్పాటుచేసే కేబినెట్ సబ్ కమిటీల్లో కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలి

    • శాసనసభ స్పీకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసే కమిటీల్లో మాలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలి

  • 2024-06-22T12:45:54+05:30

    సభలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

    • ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అయ్యన్నపాత్రుడు

    • స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు మంచిపేరు పొందాలి

    • గత ఐదేళ్లు సభ గౌరవం తగ్గింది.. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు ఎన్నికలతో సభ గౌరవం మరింత పెరుగుతుంది.

  • 2024-06-22T12:38:57+05:30

    సభలో టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు

    • చిన్నవారికి అయ్యగా.. రాష్ట్రప్రజలకు ప్రీతిపాత్రుడిగా.. సమాన వయస్కులకు అన్నగా ఉండేలా స్పీకర్‌కు అయ్యన్నపాత్రుడి పేరును పెట్టారు

    • వైసీపీ అధినేత తన పేరును మర్చిపోయారు

    • సభకు వచ్చి తన పేరునే మర్చిపోయిన నేత జగన్

    • జగన్‌పై రఘురామకృష్ణంరాజు పంచ్‌లు

    • శాసనసభలో ప్రతి సభ్యుడికి గౌరవం ఇవ్వాలి

    • శాసనసభ్యుల గౌరవాన్ని అయ్యన్నపాత్రుడు కాపాడతారు

    • అయ్యన్నపాత్రుడు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలి

    • ప్రజల అందరి మన్ననలు పొందిన నాయకుడు అయ్యన్నపాత్రుడు

  • 2024-06-22T12:34:57+05:30

    సభలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

    • గత ఐదేళ్లు సభలో వైసీపీ ప్రభుత్వం ఎంతో పక్షపాతంగా వ్యవహరించింది

    • వైసీపీ సభ్యులు మాట్లాడిన భాష ఎంతో దురదృష్టకరం

    • మరోసారి సభలో చీకటి రోజులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సభపై ఉంది

  • 2024-06-22T12:32:02+05:30

    సభలో మంత్రి నాదేండ్ల మనోహర్

    • గత ఐదేళ్లు సభ జరిగిన తీరు చూస్తే రాష్ట్ర గౌరవం తగ్గింది

    • నిబంధనలు పాటించకుండా వైసీపీ సభను నడిపింది

    • అయ్యన్నపాత్రుడు సభ గౌరవాన్ని పెంచేలా అంకితభావంతో పనిచేయాలి

    • శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలి

    • సభ మర్యాదను పెంచే విధంగా అయ్యన్నపాత్రుడు పనిచేయాలి

    • గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలు దురదృష్టకరం

    • చట్టాన్ని సవరించినప్పుడు గత ప్రభుత్వం సభ అనుమతి తీసుకోలేదు

    • కొత్త సభ్యులకు చర్చల్లో పాల్గొనేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి

    • మీపై నమ్మకంతో జనసేన, బీజేపీ, టీడీపీ ఏకగ్రీవంగా స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకున్నాము

  • 2024-06-22T12:17:51+05:30

    సభలో మంత్రి కొల్లు రవీంద్ర

    • అయ్యన్నపాత్రుడు అంటే అభిమాన పాత్రుడు

    • గత ప్రభుత్వం అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకుని వేధించింది

    • దేవాలయం వంటి శాసనసభలో అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తులు వైసీపీ నాయకులు

    • వైసీపీ నాయకుల వ్యవహరం కారణంగానే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు

  • 2024-06-22T12:15:35+05:30

    సభలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

    • గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు

    • గత ప్రభుత్వ వేధింపులకు గురైన వ్యక్తుల్లో నేను ఒకరిని

    • అయ్యన్నపాత్రుడు కుటుంబం ఎంతో బాధను అనుభవించింది

    • శాసనసభకు వైసీపీ సభ్యులు వచ్చి ఉండాల్సింది

  • 2024-06-22T12:11:50+05:30

    సభలో హోంత్రి అనిత

    • ఉత్తరాంధ్ర టైగర్‌ అయ్యన్నపాత్రుడు

    • గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఎంత వేధించినా ఎదురొడ్డి నిలబడ్డారు

    • బీసీ నాయకుడిని స్పీకర్‌గా చేస్తే విపక్ష ఎమ్మెల్యేలు హాజరు కాలేదు

    • ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ సీఎంగా వైసీపీ అధినేతను గౌరవిస్తున్నాం

    • జగన్ హాజరు కాకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారని ఆశించాం

    • సభా మర్యాదాలను వైసీపీ సభ్యులు పాటించడం లేదు

    • గత వైసీపీ ప్రభుత్వంలో సభ గౌరవాన్ని తగ్గించారు

    • సభ గౌరవాన్ని పెంచేందుకు అయ్యన్నపాత్రుడు కృషిచేస్తారనే విశ్వాసం ఉంది.

      Vangalapudi Anita.jpg

  • 2024-06-22T12:02:56+05:30

    సభలో అచ్చెన్నాయుడు

    • ఉత్తరాంధ్ర నుంచ స్పీకర్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తి అయ్యన్నపాత్రుడు

    • ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్‌గా ఎన్నికకావడం ఆనందంగా ఉంది

    • ఏడు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా అయ్యన్న పనిచేశారు

    • 1996లో అధినేత మాటను గౌరవించి మంత్రి పదవి వదిలి ఎంపీగా పోటీచేసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు

    • బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేస్తే చూడలేని స్థితిలో వైసీపీ సభ్యులు ఉన్నారు

    • బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు పదవులు పొందితే చూడలేని వ్యక్తులు వైసీపీ సభ్యులు

    • గత శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు

    • సభలో మా సీట్లలో కూర్చుంటే వైసీపీ సభ్యులు వచ్చి అసభ్యపదజాలంతో దూషించారు

    • ఓ దళిత ఎమ్మెల్యేపై గత వైసీపీ ప్రభుత్వంలో సభలో దాడి జరిగింది

    • అయ్యన్నపాత్రుడు స్పీకర్ అయిన నేపథ్యంలో ఆయన అవతారం మార్చాల్సి ఉంది

    • సభ గౌరవం పెరిగేలా అయ్యన్నపాత్రుడు వ్యవరిస్తారనే నమ్మకం ఉంది

    • రాష్ట్రప్రయోజనాల కోసం సభ్యులంతా పనిచేయాలి

    • ప్రజలు ఇచ్చిన మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి

  • 2024-06-22T11:54:38+05:30

    సభలో మంత్రి సత్యకుమార్

    • స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడుకు శుభాకాంక్షలు

    • సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు

    • ఉత్తరాంధ్రా సమస్యలపై పోరాడుతూ.. ప్రజల వాణిని రాష్ట్రవ్యాప్తంగా వినిపించిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు

    • గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడింది

    • అవినీతికి చిరునామాగా గత వైసీపీ ప్రభుత్వం మారింది

    • అయ్యన్నపాత్రుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారనే విశ్వాసం ఉంది

    • అయ్యన్నపాత్రుడి అనుభవం సభకు మరింత గౌరవం తీసుకువస్తుంది

    • శాసనసభాపతి బాధ్యతలు స్వీకరించే సమయంలో సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం

    • ప్రజాస్వామ్యం పట్ల వైసీపీకి ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థమవుతోంది.

  • 2024-06-22T11:48:49+05:30

    శాసనసభలో లోకేష్

    • అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు

    • ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు

    • 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారు

    • 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉంది

    • ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడు

    • అయ్యన్నపాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టింది

    • అయ్యన్నపాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించారు

    • రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తిని నేను

    • గతంలో సభ ఎంతో హుందాగా జరిగేవి

    • గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవరించింది

    • సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని స్పీకర్‌ను కోరిన లోకేష్

    • ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలో ప్రతిపక్షం లేకపోయినా.. మనమే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలి

    • అయ్యన్నపాత్రుడిపై ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడారు

    • అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి

  • 2024-06-22T11:40:05+05:30

    సభలో పవన్ కళ్యాణ్

    • అయ్యన్నపాత్రుడు సీనియర్ నాయకుడు- పవన్

    • అయ్యన్నపాత్రుడు ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు- పవన్

    • అయ్యన్నపాత్రుడుకు తిట్టే అవకాశం లేకుండా పోయింది- పవన్

    • వైసీపీ సభ్యులు సభ నుంచి పారిపోయారు-పవన్

    • భాష మనుషులను కలపడానికి.. విడగొట్టడానికి కాదు- పవన్

    • భాష సమస్యల పరిష్కారానికి.. వివాదాలు సృష్టించుకోవడానికి కాదు- పవన్

    • వైసీపీ నాయకులు గెలుపును ఆస్వాదించారు.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు- పవన్

    • సభలో ఉండే ధైర్యం లేక వైసీపీ సభ్యుల పారిపోయారు..

      Pawan Kalyan.jpg

  • 2024-06-22T11:35:40+05:30

    పోలవరం, రాజధాని..

    • రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి- చంద్రబాబు

    • పోలవరం, రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానంపై దృష్టిపెట్టాలి

    • అయ్యన్నపాత్రుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రసమస్యలపై పరిష్కార మార్గాలు చూపించాలి- చంద్రబాబు

  • 2024-06-22T11:33:01+05:30

    నేను సీనియర్..

    • నేను శాసనసభలో సీనియర్ సభ్యుడిని- చంద్రబాబు

    • మొత్తం 16 సభలు జరగ్గా 9 సభల్లో ఉన్నా- చంద్రబాబు

    • 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా-చంద్రబాబు

    • నా జీవితంలో 15వ శాసనసభలో జరిగినట్లు ఎప్పుడూ జరగలేదు- చంద్రబాబు

    • సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి- చంద్రబాబు

    • అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో సభ హుందాగా నడుస్తుందనే నమ్మకం ఉంది- చంద్రబాబు

    • రాజ్యాంగ స్ఫూర్తిని అయ్యన్న కాపాడతారు- చంద్రబాబు

  • 2024-06-22T11:29:05+05:30

    పవన్‌పై ప్రశంసలు..

    • పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసలు

    • ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్- చంద్రబాబు

    • పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారు- చంద్రబాబు

    • పవన్ పోటీచేసిన 21 చోట్ల గెలిచారు- చంద్రబాబు

  • 2024-06-22T11:24:51+05:30

    గత ఐదేళ్లు ఎంతో బాధపడ్డా

    • గత ఐదేళ్లుగా శాసనసభలో జరిగిన సంఘటనలు చూసి బాధపడ్డా

    • గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసేటప్పుడు చేసిన ప్రకటనను రిపీట్ చేసిన చంద్రబాబు

    • కౌరవ సభలో తాను ఉండనని.. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పానన్న చంద్రబాబు

    • తన కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారు- చంద్రబాబు

    • వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారు- చంద్రబాబు

    • గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చాను- చంద్రబాబు

    • రాష్ట్రంలో ఆడబిడ్డలకు వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ ఈ సభలో జరగకూడదన్న చంద్రబాబు

    • తనకు మరో జన్మఅంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నా- చంద్రబాబు

    • అవతలి పార్టీ సభ్యులను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు- చంద్రబాబు

    • వైసీపీ సభ్యులను సభలో గౌరవించాలి- చంద్రబాబు

    • గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారు- చంద్రబాబు

  • 2024-06-22T11:17:47+05:30

    సభ్యులకు చంద్రబాబు కీలక సూచనలు

    • సభలో సభ్యులంతా హుందాగా వ్యవహరించాలి.

    • నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టిపెట్టాలి

    • నిర్ధేశిత సయంలో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

    • నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి సభ్యుడు పనిచేయాలి

  • 2024-06-22T11:15:55+05:30

    చంద్రబాబు అభినందనలు

    • స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి అభినందనలు తెలిపిన చంద్రబాబు నాయుడు

    • అయ్యన్న కరుడుగట్టిన పసుపు యోధుడు- చంద్రబాబు

    • 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోసిన పోరాట యోధుడు అయ్యన్నపాత్రుడు- చంద్రబాబు

    • అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ముద్దు బిడ్డ- చంద్రబాబు

    • 42 ఏళ్లుగా ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు- చంద్రబాబు

    • నర్సీపట్నం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు-చంద్రబాబు

    • అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు- చంద్రబాబు

    • అయ్యన్నపాత్రుడుపై 20కు పైగా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు- చంద్రబాబు

    • అయ్యన్నపాత్రుడిపై అత్యాచారం కేసు పెట్టడం దారుణం-చంద్రబాబు

  • 2024-06-22T11:09:55+05:30

    స్పీకర్‌గా అయ్యన్న

    • ఏపీ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    • అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్

  • 2024-06-22T10:54:10+05:30

    టీ బ్రేక్..

    • స్పీకర్ ఎన్నికకు ముందు టీ బ్రేక్

    • టీ బ్రేక్ ముగియగానే స్పీకర్ ఎన్నిక

    • అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్

    • అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లనున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు

  • 2024-06-22T10:50:52+05:30

    వైసీపీ డుమ్మా

    • ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు.

    • స్పీకర్ ఎన్నికపై వైసీపీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం

    • వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి తెలియజేసిన శాసనసభ వ్యవహరాల మంత్రి పయ్యావుల కేశవ్

    • స్పీకర్ ఎన్నిక రోజు సభకు హాజరుకాకపోవడం ద్వారా.. సభా సంప్రదాయాలను గౌరవించని వైసీపీ

  • 2024-06-22T10:45:19+05:30

    స్పీకర్ ఎన్నిక

    • ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

    • అయ్యన్నపాత్రుడు ఒక్కరే స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో.. ఆయన స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాసేపట్లో ప్రకటిస్తారు.

  • 2024-06-22T10:39:49+05:30

    సభ్యుల ప్రమాణం

    • సభ రెండో రోజు ప్రారంభం కాగానే వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రమాణం చేశారు.

    • ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రమాణం చేశారు.

    • కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు.

  • 2024-06-22T10:34:24+05:30

    • ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తున్నారు.

  • 2024-06-22T10:27:17+05:30

    • ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ కాసేపట్లో ప్రారంభం కానుంది.