AP Capital: అమరావతి పనులు మరింత వేగం.. టెండర్లకు పిలుపు
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:59 AM
AP Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక అమరావతి, పోలవరానికి వెళ్లివచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన ఆయన తక్షణమే అమరావతి పనులు చేపట్టాలని ఆదేశించారు.
అమరావతి, డిసెంబర్31: ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.1200 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచారు. రాజధాని జోన్ 5 b, 5 d లో రోడ్లు, డ్రైన్లు... ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1206 కోట్లు టెండర్లు పిలిచారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో పనులకు నోటిఫికేషన్ విడుదలచేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీంలోని భూముల్లో మౌలిక వసతుల కల్పనకు వేరువేరుగా సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. జనవరి 21 వరకు టెండర్లు వేసేందుకు గడువు ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా పనులు ప్రారంభంకానున్నాయి. రెండు మూడు రోజుల్లో మిగితా పనులకు టెండర్లు పిలువనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు (CM Chandrababu Naidu) బాధ్యతలు స్వీకరించాక అమరావతి, పోలవరానికి వెళ్లివచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన ఆయన తక్షణమే అమరావతి పనులు చేపట్టాలని ఆదేశించారు.
అందులో భాగంగా ప్రస్తుతం రూ.1200 కోట్ల విలువైన పనులకు సంబంధించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లుగా నోటీఫికేషన్‌లో పేర్కొంది. ల్యాండ్ పూలింగ్ స్కీంలోని భూముల్లో మౌలిక వసతుల కల్పనకు వేరుగా సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. జోన్ 5బీ, 5డీ లో రోడ్లు, డ్రైన్, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.1206 కోట్ల టెండర్లు పిలిచింది. వచ్చే 21 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించింది. జనవరి నెలాఖరులోగా పనులు ప్రారంభంకావాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్ల రాజధాని అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వం ఆ పనులకు కూడా రెండు,మూడు రోజుల్లో మిగిలిన పనులకు కూడా టెండర్లు పిలవనుంది.
ఇవి కూడా చదవండి...
ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..
బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి
Read Latest AP News And Telugu News