Share News

YS Jagan: ప్రతిపక్ష నేత పదవిపై స్పీకర్‌కు అనూహ్య లేఖ రాసిన వైఎస్ జగన్

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:31 PM

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం అసెంబ్లీ పద్దతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

YS Jagan: ప్రతిపక్ష నేత పదవిపై స్పీకర్‌కు అనూహ్య లేఖ రాసిన వైఎస్ జగన్

అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం అసెంబ్లీ పద్దతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారని జగన్ అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు.


ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయాన్ని పరిశీలించండి: జగన్

అధికారకూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని అన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిని జగన్ అభ్యర్థించారు.

Updated Date - Jun 25 , 2024 | 01:35 PM