Share News

Nandyal: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

ABN , Publish Date - Oct 13 , 2024 | 08:34 AM

నంద్యాల: శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.

Nandyal: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

నంద్యాల: శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయానికి (Mallanna Temple) ఆదివారం భక్తుల రద్దీ (Crowd of Devotees) పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది. కాగా దసరా మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు శనివారం విజయదశమిని పురస్కరించుకుని భ్రమరాంబికాదేవి నిజరూపాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ నిర్వహించారు.


శ్రీశైలం మహా క్షేత్రంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు శుక్రవారం అమ్మవారు సిద్ధదాయినిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుదాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్రపారాయణాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు.

స్వామి, అమ్మవార్లకు అశ్వ వాహన సేవ

దసరా ఉత్సవాల్లో భాగంగా తొమిదో రోజు శుక్రవారం అమ్మవారు సిద్ధిదాయిని అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు. వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని నిలిపేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారా యణ రెడ్డి, శ్రీశైలం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ, ఆలయ ఈవో డి. పెద్దిరాజు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.


పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైలం మహా క్షేత్రంలో జరిగే దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల ను సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 08:34 AM