Share News

మహిళ నేత్ర దానం

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:37 AM

నంద్యాల దేవనగర్‌కు చెందిన ఆదిలక్ష్మమ్మ అనే మహిళ సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నంద్యాలలోని ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రి వచ్చారు.

మహిళ నేత్ర దానం
ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్‌ ఇస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, డాక్టర్‌ మాధవీలత

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 2: నంద్యాల దేవనగర్‌కు చెందిన ఆదిలక్ష్మమ్మ అనే మహిళ సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నంద్యాలలోని ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రి వచ్చారు. అయితే ఆ తర్వాత కోమాలోకి వెళ్లి మృతిచెందారు. ఆదిలక్ష్మమ్మ నేత్రాలను దానం చేయడం కోసం ఆమె కుమారులు నరేంద్ర కుమార్‌, నాగేశ్వరరావు రెడ్‌క్రాస్‌ సొసైటీని సంప్రదించారు. దీంతో రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ దస్తగిరి పర్ల, ఆర్గాన్‌ డొనేషన్‌ మోటివేషన్‌ కోఆర్డినేటర్‌ ఖండే ఆనంద్‌ గురూజీ, ట్రెజరర్‌ నాగేశ్వరావు తక్షణమే ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో, ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే రెడ్‌క్రాస్‌ సొసైటీ ఐ బ్యాంకు కర్నూలు టెక్నీషయన్స్‌ నాగన్న, ప్రదీప్‌ ఆదిలక్ష్మమ్మ నేత్రాలను సేకరించారు. అనంతరం నేత్రదానాలు చేసిన ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు జిల్లా నివారణ సంస్ధ అధికారి డాక్టర్‌ మాధవీలత, రెడ్‌క్రాస్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు. అనంతరం ఇద్దరకి చూపు ప్రసాదించిన ఆదలక్ష్మమ్మ కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్‌ సంస్ధ సభ్యులు అభినందించారు.

Updated Date - Sep 03 , 2024 | 12:37 AM