Share News

పెద్దాసుపత్రికి వంద ఫ్యాన్లు విరాళం

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:20 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చే రోగుల కోసం కర్నూలు మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ వంద సీలింగ్‌ ఫ్యాన్లను విరాళంగా అందించింది.

పెద్దాసుపత్రికి వంద ఫ్యాన్లు విరాళం
ఫ్యాన్లను అందజేస్తున్న కలెక్టర్‌

ముందుకొచ్చిన అల్యూమి, రెడ్‌క్రాస్‌ సొసైటీలు

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 10: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స కోసం వచ్చే రోగుల కోసం కర్నూలు మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ వంద సీలింగ్‌ ఫ్యాన్లను విరాళంగా అందించింది. ఈ మేరకు కలెక్టర్‌ పి.రంజితబాషా మంగళవారం మధ్యాహ్నం హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డికి అందిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దాతలు ఇచ్చిన ఫ్యాన్లను వార్డు లు, కామన వెయిటింగ్‌ హాల్‌లో రోగులు విశ్రాంతి సమయంలో దోమల బెడద లేకుండా వీటిని ఉపయోగించా లన్నారు. కార్యక్రమంలో కేఎంసీ పూర్వ విద్యా ర్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డా.కుమారస్వామి రెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి, సీనియర్‌ వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:21 AM