పెట్నికోటలో పర్యటించిన ఎస్పీ
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:57 PM
ఇటీవల పోలింగ్ సందర్భంగా ఘర్షణ తలెత్తిన పెట్నికోట గ్రామాన్ని నంద్యాల ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి ఆదివారం సందర్శించారు.

కొలిమిగుండ్ల రూరల్, జూన్ 2: ఇటీవల పోలింగ్ సందర్భంగా ఘర్షణ తలెత్తిన పెట్నికోట గ్రామాన్ని నంద్యాల ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న పోలీసు పికెట్‌ను పరిశీలించి, ఘర్షణల నివారణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి సీఐ గోపినాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏజంట్లు, అభ్యర్థులు మినహా ఎవ్వరూ కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ గోపినాథ్ రెడ్డి, ఎస్బీ ఎస్‌ఐ హరినాథరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భం గా రెండు రోజులుగా వివిధ కూడళ్లలో నిర్వహిస్తున్న పోలీస్ పికెట్‌ను ఆదివారం ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పోలీస్ పికెట్‌లను తనిఖీ చేసి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుం డా జాగ్రత్తగా ఉండాలని పికెట్ సిబ్బందిని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు జరగకుండా, టపాసులు పేల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.