Share News

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:51 AM

వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’
మాట్లాడుతున్న డీఏవో మురళీకృష్ణ

నంద్యాల రూరల్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు. శనివారం నంద్యాల జిల్లా వనరుల కేంద్రంలో ఉప వ్యవసాయ సంచాలకులు సరళమ్మ ఆధ్వర్యంలో నంద్యాల డివిజన్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి నైపుణ్య సామర్థ్యం పెంపుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీఎవో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంటలకు ఆధునిక వ్యవసాయ సాగు విధానాలను తెలియజేయాలన్నారు. రబీలో సాగుచేసే మినుము, శనగ, వరి తదితర పంటలకు బీమా చేయించాలని స్వష్టంచేశారు. నంద్యాల వ్యవసాయ సహయ సంచాలకులు రాజశేఖర్‌, ఆర్‌ఏఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ జాన్సన్‌, వ్యవసాయ అధికారులు ప్రసాదరావు, హేమసుందరరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, స్వాతి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, వీహెచ్‌ఏలు, వీఏఏలు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:51 AM