టీడీపీలోకి వైసీపీ నాయకులు
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:35 AM
కొలిమిగుండ్లలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

కొలిమిగుండ్ల, జనవరి 21: కొలిమిగుండ్లలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 65 కుటుంబాలు వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ దేవునికొండ సీతారామయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరాయి. కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో బీసీ జనార్దన్‌రెడ్డి టీడీపీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. బీసీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి అభవృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వైసీపీ నాయకులు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు పేదల ఆస్తులు కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను వేధిస్తున్నారన్నారు. టీడీపీలో చేరుతున్న వారికి పింఛన్లు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. మాజీ సర్పంచ్ సీతారామయ్యకు తాము అన్ని వేళలా అండదండగా ఉంటామన్నారు. కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టీడీపీ కన్వీనర్ మూలే రామేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్ఙి నంద్యాల రామేశ్వరరెడ్డి, నంద్యాలనారాయణరెడ్డి, ఎల్‌ఐసీ చిన్నపురెడ్డి, బొట్టు స్వామి టైలర్ వెంకటరాముడు, కళ్యాణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జయలక్ష్మిరెడ్డి, ప్రచార కార్యదర్శి శివరామిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
డోన్: వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని, చరమగీతం పాడాలని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో కొత్తకోట గ్రామంలోని వైసీపీకి చెందిన 40 కుటుంబాలు సుబ్బారెడ్డి సమక్షంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. వైసీపీ కార్యకర్తలు లక్ష్మన్న, మాధవకృష్ణ, వెంకటస్వామి, నాగార్జున, ఓబులేసు, రామాంజనేయులు, తిరుపాలు, పాండుతో పాటు 40 కుటుంబాల కార్యకర్తలు టీడీపీలో చేరారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ విడుదల చేస్తానని మాట ఇచ్చి వైసీపీ మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ చెప్పే మాయమాటలను ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావాలన్నా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తేనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎల్‌ఐసీ శ్రీరాములు, రామ్మోహన్ యాదవ్, ధనుంజయ, పరుశరాముడు, పెద్ద వెంకటేశ్, రంగస్వామి, నాగేంద్ర, మల్లికార్జున, రమణయ్య, మునేంద్ర తదితరులు పాల్గొన్నారు.