Share News

Minister Narayana: బుడమేరు ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైంది

ABN , Publish Date - Oct 05 , 2024 | 10:55 AM

బుడమేరు వాగు ఉప్పెనతో ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలనుసారం ఆపరేషన్ బుడమేరు అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అదికారులతో నెల్లూరులో సమీక్ష నిర్వహించామని అన్నారు. పది రోజుల్లో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయాలనీ ఆదేశాలిచ్చాని తెలిపారు.

Minister Narayana: బుడమేరు ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైంది

నెల్లూరు: బుడమేరు ఆక్రమణల కారణంగా విజయవాడ ముంపునకు గురైందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో పారుదల కాలువలను ఇవాళ( శనివారం) మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... 2015లో నెల్లూరు నగరంలో వచ్చిన వరదలకు మునిగిపోయిందని చెప్పారు. నెల్లూరు నగర అభివృద్ధి కోసం సమ్మూలంగా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. బుడమేరు వాగు ఉప్పెనతో ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని మంత్రి నారాయణ తెలిపారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలనుసారం ఆపరేషన్ బుడమేరును అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అదికారులతో నెల్లూరులో సమీక్ష నిర్వహించామని అన్నారు. పది రోజుల్లో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చాని తెలిపారు. పది రోజుల తర్వాత కాలువల వైండింగ్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూపించి కాలువల మరమ్మతులు చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు సహకరించాలని.. ఆక్రమణల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు.


ఏపీఐఐసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంతెన రామరాజు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంతెన రామరాజు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంతెన రామరాజు మాట్లాడుతూ... ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనను నమ్మిఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌, కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ ద్వారా కియా, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. 2019-2024 మధ్య వచ్చిన జగన్ ప్రభుత్వం ఏపీఐఐసీని నిరుపయోగం చేసిందని మండిపడ్డారు. మళ్లీ 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలoదరికీ ఏపీఐఐసీని అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంత్రులు అందరి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసీకి సంబంధించి ఒక లే అవుట్ తయారుచేసి ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తామని అన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని.. అందులో భాగంగానే మంత్రులందరూ పనిచేస్తున్నారని తెలిపారు. 100 రోజులు పూర్తయ్యేలోగానే చాలా పరిశ్రమలను పారదర్శకంగా ముందుకు తీసుకు వెళ్లటం జరిగిందని మంతెన రామరాజు వెల్లడించారు.

Updated Date - Oct 05 , 2024 | 11:04 AM