Share News

విద్యా సంస్థల్లో ముందస్తు దసరా వేడుకలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:25 AM

స్థానిక వాసవీ విద్యానికేతన్‌లో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

విద్యా సంస్థల్లో ముందస్తు దసరా వేడుకలు

కంభం, అక్టోబరు 1 : స్థానిక వాసవీ విద్యానికేతన్‌లో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి వేషధారణలో నృత్యాలతో అలరించారు. అమ్మ వారి విగ్రహానికి పూజలు చేశారు. విజయదశమి పండుగ గురించి వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవీ విద్యాసంస్థల చైర్మన్‌ గోళ్ల సుబ్బరత్నం, డైరెక్టర్‌ కల్పన, షేక్‌ కరీమున్నీసా తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : పట్టణంలోని భాష్యం పాఠశాలలో ముందుస్తు దసరా సంబ రాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ కేవీ.నాగరాజు అధ్యక్షత వహించారు. విజయదశమి ప్రాముఖ్యత వివరిం చారు. ప్రతి ఒక్కరూ చెడును విడిచి మంచిని అలవరుచుకోవాలన్నారు. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందన్నారు. దుర్గాదేవి మహిషా సురుడు అనే రాక్షసుడిని సంహరించడంతో విజయదశమిగా భక్తులు దసరా పండుగ చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో లిటిల్‌ చాప్స్‌ ఇన్‌చార్జ్‌ హేమసుధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరక్షేత్రంలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో ఈ నెల 3 నుంచి నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రిక, ఆహ్వాన పత్రికలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు మార్కాపురంలోని తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని, భక్తులందరూ సహకరించాలని ఎరిక్షన్‌బాబు కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, అర్చకులు ప్రసాదు, విశ్వం, టీడీపీ నాయకులు ఎం.వలరాజు, మోటకట్ల శ్రీనివాసరెడ్డి, దేవినేని చలమయ్య, ఆళ్ల నాసరరెడ్డి, పాల్గొన్నారు.

కొమరోలు : ప్రతి విద్యార్థి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని ఎస్‌బీఎన్‌ ఆర్‌ఎం విద్యాలయాల కరస్పాండెంట్‌ బందుగు ల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌బీఎన్‌ ఆర్‌ఎం ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో దసరా శరన్నవరాత్రుల విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతిని ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా విద్యార్ధులు ప్రార్ధించాల న్నారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రుల విశిష్టతల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యాక్రమంలో విద్యార్థులు అమ్మవారి వివిద రూపాల్లో ప్రదర్శన నిర్వాహించారు. కార్యాక్రమం లో ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి, రేవతి పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Oct 02 , 2024 | 12:25 AM