Share News

నగరంలో కిలాడీ లేడి హల్‌చల్‌ !

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:04 AM

ఒంగోలు నగరంలో గత నెల రోజులుగా ఓ కిలాడీ లేడి హల్‌చల్‌ చే స్తోంది. ఆటోలో ప్రయాణిస్తూ తనతో పాటు ఎక్కి న మహిళల హ్యాండ్‌బ్యాగులను కట్‌ చేసి అందులో నగదును తస్కరించడం పరిపాటిగా మారింది.

 నగరంలో కిలాడీ లేడి హల్‌చల్‌ !

మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు

ఆటోల్లో మాట కలుపుతూ ప్రయాణం

హ్యాండ్‌బ్యాగులను కట్‌ చేయడంలో నేర్పరి

వాపోతున్న బాధితులు

ఒంగోలు(క్రైం), జూలై 20: ఒంగోలు నగరంలో గత నెల రోజులుగా ఓ కిలాడీ లేడి హల్‌చల్‌ చే స్తోంది. ఆటోలో ప్రయాణిస్తూ తనతో పాటు ఎక్కి న మహిళల హ్యాండ్‌బ్యాగులను కట్‌ చేసి అందులో నగదును తస్కరించడం పరిపాటిగా మారింది. దీంతో పలువురు బాధితులు వాపోతున్నారు. మ హిళా ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని మాటలు కలుపుతూ ఆమె చోరీలకు పాల్పడుతోంది. తెలిసిన వివరాల మేరకు.. చోరీలలో ఆరితేరిన ఓ మహిళ ఒంగోలులోని కిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఆటోలలో ప్ర యాణికురాలిగా ఎక్కి పోతురాజుకాలువ వద్దకు వచ్చి దిగి వెళ్లి పోతుంది. అయితే అదే ఆటోలో ప్రయాణించిన మహిళలు తమ గమ్యస్థానాల వద్ద దిగి బ్యాగులో నగదు లేక పోవడం చూసి బావురు మంటున్నారు. సుమారు నెల రోజులుగా ఈ కిలా డీ లేడి చోరీలకు పాల్పడుతున్నది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ అంటీముట్ట నట్లు వ్యహరిస్తున్నారు. ఈక్రమంలో శనివారం ఉదయం పెదకొత్తపల్లికి చెందిన ఓ మహిళ వద్ద ఉన్న హ్యాండ్‌బ్యాగును కట్‌ చేసి అందులోని రూ. 30 వేలు చోరీ చేసింది. ఇలా తరచుగా ఆ కిలాడీ లేడి అదేరూట్‌లో ఆటోలలో ప్రయాణం చేస్తూ మ హిళా ప్రయాణికులను దోచుకుంటోంది. నగదు అ పహరించిన తరువాత పోతురాజుకాలువ వద్ద దిగి వెళ్ళి పోతుందని పలువురు బాధితులు చెబుతు న్నారు. నెల రోజుల వ్యవధిలో వరుసగా సుమారు ఈ విధంగా ఆరు చోరీలు జరిగినట్లు చెబుతున్నా రు. ఇప్పటికైనా పోలీసులు ఈ కిలాడీ లేడిపై దృష్టి సారించి ఆట కట్టించి చోరీలను అరికట్టాలని ప్రజ లు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2024 | 12:04 AM