భవిష్యత్ బాగుండాలంటే టీడీపీకి ఓటెయ్యండి
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:43 PM
భావితరాల భవిష్యత్ బాగుపడాలంటే టీడీపీకి ఓటెయ్యాలని సీనియర్ నేత మాజీ వైస్‌చైర్మన్ వీవీఆర్ మనోహరరావు(చిరంజీవి) అన్నారు. కనిగిరి పట్టణంలోని 16వ వార్డులో శనివారం రాత్రి సూపర్‌సిక్స్ పఽథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో కనిగిరి అభివృద్ధి జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు తప్ప అభివృద్ధి లేదన్నారు.
బాబు ష్యూరిటీ కార్యక్రమంలో నాయకులు
కనిగిరి, మార్చి 23 : భావితరాల భవిష్యత్ బాగుపడాలంటే టీడీపీకి ఓటెయ్యాలని సీనియర్ నేత మాజీ వైస్‌చైర్మన్ వీవీఆర్ మనోహరరావు(చిరంజీవి) అన్నారు. కనిగిరి పట్టణంలోని 16వ వార్డులో శనివారం రాత్రి సూపర్‌సిక్స్ పఽథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో కనిగిరి అభివృద్ధి జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు తప్ప అభివృద్ధి లేదన్నారు. వైసీపీ పాలనలో పేదల భూములన్నీ కబ్జాకు గురయ్యాయన్నారు. కొళాయి ద్వారా మంచినీ టిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన నేతలు మాటతప్పారన్నారు. డాక్టర్ ఉగ్ర ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీటి కొళాయిలు వే యిస్తారన్నారు. అలాగే ఇచ్చిన హామీలన్నీ నెర వేర్చేందుకు కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల్లో ప్రజాసేవకుడైన డాక్టర్ ఉగ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మద్యం అమ్మకాలను నిలిపేస్తామని చెప్పిన జగన్‌రెడ్డి సొంత మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా, అప్పుల ఆంధ్రగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాలనూ నాశనం చేసిన జగన్‌రెడ్డిని ఇక శాశ్వతంగా ఇంటికి పంపించాలన్నారు. విజ్ఞత తో మీ ఓటును రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే చంద్రబాబుకు వేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.15వేలు, చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు అందజేస్తారన్నారు. ప్రతి పథకంలోనూ చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యత ను ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసురెడ్డి, షేక్ ఫిరోజ్, చిలకపాటి లక్ష్మయ్య, షేక్ నజిముద్దీన్, బుల్లా బాలబాబు, గుడిపాటి ఖాదర్, తమ్మినేని వెంకటరెడ్డి, దింటకుర్తి సుబ్రమణ్యం తెలుగు మహిళలు కరణం అరుణ, మాజీ కౌన్సిలర్‌లు షేక్ వాజిదాబేగం, బొగ్గరపు శ్రీలత, దొరసాని, తులసి, స్వప్న, నారాయణమ్మ, వెంకటలక్షమ్మ, దనలక్ష్మీ, అమ్ములమ్మ, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.
చంద్రబాబు పథకాలతో మహిళలకు మేలు
పామూరు : వైసీపీ పాలనలో అన్ని విధాలా మోసపోయిన, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన మహిళలకు చంద్రబాబు సూపర్‌సిక్స్ పథకాలతో మేలు కలుగుతుందని టీడీపీ ఫోర్‌మెన్ కమిటీ సభ్యుడు, వార్డు మెం బర్ ఉప్పలపాటి హరిబాబు తెలిపారు. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పువ్వాడి ఆదేశాల మే రకు పట్టణంలోని ఆకులవీధిలో బాబు ష్యూ రిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నిత్యావసరాలు, గ్యాస్, బస్సు, కరెంట్ చా ర్జీలు ఎడాపెడా పెరిగాయన్నారు. అధికారంలోకి వస్తే అన్ని ధరలను తగ్గిస్తానని, పేదలపై భారాలు పడనీయనని పదేపద్దే ఎన్నికల్లో చెప్పిన జగన్‌రెడ్డి అన్ని ధరలను పెంచడంతోపాటు చివరకు పేదల నుంచి చెత్త పన్ను ముక్కుపిండి వసూలుచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంతోపాటు పట్టణాలు, గ్రామాలను అభివృద్ధికి దూరం చేసి సర్వనాశనం చేశారన్నారు. ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీ నేతలకు లే దన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను, కనిగిరి నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ ఉగ్ర ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్ పథకాల వల్ల కలిగే ప్ర యోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బూత్ కమిటీ ఇన్‌చార్జిలు మెంటా నరసింహారావు, బండ్ల నారాయణ, సుంకే వెంకటస్వామి సుంకే మో హనరావు, రాంబా బు, ఈర్ల సత్యం, గద్దె అరవింద్, బండ్ల సురేష్, మహిళలు పాల్గొన్నారు.
టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి
పీసీపల్లి : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని భట్టుపల్లి బూత్ ఇన్‌చార్జి మూలె పుల్లారెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యా రెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఆ గ్రామంలో సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. మండల నాయకులు, బుతూలెవల్ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.అనంతరం సూపర్‌సిక్స్ కరదీపికలను ప్రజలకు పంపిణీచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5సంవత్సరాల వైసీపీ పాలనలో చెప్పుకునేందుకు కూడా ఒక్క అభివృద్ధి పనిచేయలేదన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే సిమెంట్‌రోడ్లు, ప్రజలకు తాగునీరు అందించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ కనిగిరి ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డబ్బుగొట్టు రవీంద్ర, ఊసా మాల్యాద్రి, బండి మాలకొండయ్య, మాచర్లు, పిచ్చిరెడ్డి, సత్తిరెడ్డి, జోసెఫ్, ప్రసాద్, చిన బ్రహ్మయ్య, చిన వెంకటేశ్వర్లు, శ్రీను, వేణు, వెంకటరత్త య్య, మహేంద్రరెడ్డి, నానిబాబు, చినయోగయ్య ఉన్నారు.