YV Subbareddy: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:41 AM
Andhrapradesh: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు.
ప్రకాశం, జనవరి 3: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి (YSRTP Chief YS Sharmila Reddy) చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి (YCP Regional Coordinator YV Subbareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపీకి (YCP) ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు. అత్యధిక స్థానాలు వైసీపీ గెలుస్తుందని.. జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో బీసీలకు టిక్కెట్ ఇవ్వడం కోసం ఆర్కేకి ఇవ్వలేదన్నారు.
ఆర్కే మనస్తాపం చెంది బయటకు వెళ్తానంటే వెళ్లనివ్వండని అన్నారు. చాలా చోట్ల టిక్కెట్లు దక్కలేదని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారని తెలిపారు. నియోజక వర్గల్లో మార్పులు, చేర్పులు ఎన్నికల వరకు సాగుతాయన్నారు. 175 స్థానాల్లో గెలవడం వైసీపీ టార్గెట్ అని చెప్పుకొచ్చారు. ‘‘నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా. నేను ఎన్నికల్లో పోటీపై జగన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..