AP News: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:02 PM
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
అమరావతి: ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?
చర్యల్లో భాగంగానే.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని వెంకట్రామిరెడ్డికి ఆదేశించింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టింది.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వరుస కథనాలు
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికార వైసీపీకి వంత పాడడంపై ఏబీఎన్ వరుస కథనాలు ప్రచురించింది. ఆయనపై చర్యలు తీసుకోవడంలో సీఎస్ జవహర్‌రెడ్డి మేనమేషాలు లెక్కిస్తున్నారంటూ ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉంటూ సస్పెండ్ అయిన తొలి వ్యక్తి వెంకటరామిరెడ్డీ అని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘ నేతగా కాకుండా అధికార వైసీపీకి అడుగులకు మడుగులొత్తడం వల్లే సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఈ పరిస్థితి వచ్చిందంటూ ఉద్యోగుల తీవ్ర ఆగ్రనహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాన్ని పక్కనపెట్టి సొంత ప్రయోజనం కోసం ప్రయత్నించడం వల్లే ఈ దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటరామిరెడ్డి సస్పెన్షన్‌పై సచివాలయ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నారు. 70 సంవత్సరాల సచివాలయ ఉద్యోగుల సంఘం చరిత్రలో ఇదో మాయని మచ్చని సచివాలయం ఉద్యోగులు అంటున్నారు.
వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇదే అంశంపై సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతోఇటీవల వెంకట్రామిరెడ్డి భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు కూడా సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.
తాజాగా వెంకటరామిరెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని వెంకట్రామిరెడ్డికి ఆదేశించింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.
YS Sharmila: సాక్షిలో వైఎస్సార్ ఫొటోను అందుకే తీసేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు
మరిన్ని ఏపీ వార్తల కోసం...