Share News

Varla Ramaiah: జగన్ నీకు సిగ్గుందా.. అందుకే నీ తల్లి, చెల్లికి ఈ గతి పట్టింది..

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:45 PM

సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని..

Varla Ramaiah:  జగన్ నీకు సిగ్గుందా.. అందుకే నీ తల్లి, చెల్లికి ఈ గతి పట్టింది..
Varla Ramaiah

అమరావతి: వర్రా రవీంద్ర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు, అతని కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతానని వైసీపీ అధినేత జగన్ అనడం హాస్యాస్పదమన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. జగన్ చెల్లి షర్మిలపై నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రారెడ్డిని వెనకేసుకరావడానికి సిగ్గుచేటుగా లేదా జగన్? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్రా రవీంద్రరెడ్డి మంచివాడు అని జగన్ అంటే నేను జగన్ ఇంటిముందు నిలబడి సెల్యూట్ చేస్తా అని ఛాలెంజ్ చేశారు. షర్మిలపై పెట్టిన పోస్టులు అత్యంత అసభ్యకరమైనవి, జుగుప్సాకరమైనవి. షర్మిల చూస్తే కత్తితో నిన్ను పొడవనా? నేను పొడచుకోనా? అని జగన్ పైకి వస్తుందన్నారు.

మనసెలా ఒప్పింది..

ఇంతటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కాపాడడానికి జగన్ కు మనసెలా ఒప్పింది? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. మీడియా సమావేశంలో వర్రా రవీంద్రను జగన్ మంచివాడని అనడంతో సిగ్గుకే సిగ్గనిపించి ఉంటుందని కామెంట్స్ చేశారు. జగన్ చెల్లిపై పెట్టిన పోస్టుపై జగన్ కు రక్తం ఉడికి ఉంటుందనుకునేరు.. కానీ అలా జరగలేదన్నారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని వర్రా రవీంద్ర రెడ్డి పోస్టు పెడితే జగన్ ఈ విధంగా స్పందించడం చెల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయం తెలుస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ దుర్మార్గం, దురాలోచనతో ఎదుటివారిని మానసికంగా హింసించి శునకానందం పొందేవారని విమర్శలు గుప్పించారు. ఆ దురాలోచనే జగన్ తల్లిని, చెల్లిని తాకాయన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని కాపాడడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వార్ రూమ్ జగన్ పెట్టడం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా..

తల్లిని, చెల్లిని దూషిస్తే ఊరుకునేవారిలో జగన్ ప్రథముడని వర్ల రామయ్య కామెంట్స్ చేశారు. డాక్టర్ సుధాకర్ ను నడి రోడ్డుపై ఈడ్చి, వేధించి ఆ డాక్టర్ మృతికి కారణమైంది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.16 ఏళ్ల దళిత మహిళను ఐదుగురు దుండగులు పోలీసు స్టేషన్ వెనుక గదిలో అత్యాచారం చేసి పోలీసు స్టేషన్ ముందు పడేస్తే అప్పుడు గుర్తుకు రాలేదా జగన్ కు ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను, చివరకు మమ్మల్ని తిట్టారు, కుటుంబాలను నిందించారు అయినా సహించాం..జగన్ తల్లి, చెల్లిల గురించి బూతు పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్టు చేయాలో? వద్దో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.

మౌనం ఎందుకు..

వైసీపీ హయాంలో ఉగాండాలో ఉన్న కొడుకు.. సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ పోస్టు పెడితే 70 ఏళ్ల వయసున్న వాళ్ల నాన్న అయిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. జగన్ కుటుంబసభ్యులైన తల్లి, చెల్లిల గురించి పెట్టిన పోస్టులు చూసి ఇతరులకే జుగుప్సకలిగిస్తుంటే.. జగన్ మాత్రం మౌనం వహించడంలో మర్మమేమిటి? అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి గురించి ఏమనుకోవాలో.. వైసీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.


Also Read:

తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర.. భారీ ప్లాన్ చేసిన సీఎం రేవంత్

జల్, జంగిల్, జమీన్ ఊడలాక్కుంటారు జాగ్రత్త

For More Andhra Pradesh and Telangana News

Updated Date - Nov 08 , 2024 | 05:46 PM