Home Minister Anitha: బాలిక హత్య దురదృష్టకరం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:00 PM
కొప్పుగుండుపాలెం(Koppgundupalem)లో బాలిక హత్యపై హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు.
అనకాపల్లి: కొప్పుగుండుపాలెం(Koppgundupalem)లో బాలిక హత్యపై హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చీరాల ఘటనలో నిందితుణ్ని 36గంటల్లోనే పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. సురేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో రోజూ ఆమె వెంట పడేవాడు. ఇష్టం లేని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువకుణ్ని అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన సురేశ్ బాలికపై కక్ష పెంచుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి బాలిక ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. ఆమెతో గొడవకు దిగాడు. అనంతరం ఇంట్లో ఉన్న కత్తితో ఆమె గొంతు కోశాడు. కేకలు విన్న బాలిక నాన్నమ్మ చుట్టుపక్కల వారిని పిలిచింది. ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో చిన్నారి పడి ఉంది. స్థానికులు వచ్చే లోపే నిందితుడు సురేశ్ పరారయ్యాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై హోంమంత్రి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న సురేశ్‌ను పట్టుకోవాలంటూ పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.