Share News

AP Politics: వారి చెంప పగలగొట్టండి.. నాగబాబు సంచలన కామెంట్స్

ABN , Publish Date - Feb 10 , 2024 | 05:04 PM

Janasena Leader Nagababu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు.. స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.

AP Politics: వారి చెంప పగలగొట్టండి.. నాగబాబు సంచలన కామెంట్స్
Janasena Leader Nagababu

Janasena Leader Nagababu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ(Janasena Party) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అనకాపల్లి(Anakapalle)లో పర్యటించిన నాగబాబు(Nagababu).. స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని, ఆ మంత్రి పేరు పలికితే తన నోరే పాడైపోతుందని వ్యాఖ్యానించారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చెంప పగలగొట్టి.. కాలర్ పట్టుకుని తమ ప్రాంతానికి ఏం చేశారని ధైర్యంగా అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికిన ఏజెన్సీ ప్రాంతాన్నే చూపిస్తున్నారని, ఇది చాలా బాధాకరం అన్నారు.

ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూ కబ్జాలు చేసే వారిని జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చాక చెవులు మెలేసి మరి జైలుకు పంపుతామని అన్నారు నాగబాబు. యువతీ యువకుల కోసం ప్రతి నియోజకవర్గంలో 500 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 35 వేల మంది మహిళలు మాయమయ్యారని, వారిలో ఇంకా 25 వేలు మంది ఎప్పటికీ దొరకలేదన్నారు. దీనిపై సీఎం జగన్ పోలీసులతో ఒక సమీక్ష అయినా నిర్వహించరా? అని ప్రశ్నించారు నాగబాబు. జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ కఠినం చేస్తామని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారాయన.

జనసేన-టీడీపీ కూటమిని గెలిపించండి..

పిల్లలు, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జనసేన-టీడీపీ కూటమికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నాగబాబు పిలుపునిచ్చారు. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలతో పాటు, అందరికీ ఉచిత విద్య వైద్యం అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. జనసేన, టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ చూసుకుంటారని చెప్పారు.

జగన్ ఒక సైకో, అద్భుత నటుడు..

సీఎం జగన్ ఒక సైకో అని, అద్భుత నటుడు అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. జంగారెడ్డి గూడెంలో మిథనాయిల్ తాగి 35 మంది చనిపోతే.. జగన్ మాత్రం వారిది సహజ మరణం అని చెప్పడం అన్యాయం అన్నారు. ఓట్ల కోసం మనుషులను కులాల వారీగా విడదీస్తున్నారని, వైసీపీ నాయకులు ఓటర్లను ప్రాణం ఉన్న మనుషులుగా గుర్తించాలన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 07:15 PM