Share News

Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Aug 21 , 2024 | 09:21 AM

Andhrapradesh: సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు.

Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
Minister Kollu Ravindra

విశాఖపట్నం, ఆగస్టు 21: సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Mnister Kollu Ravindra) బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేముడన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

RRB Recruitment 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల జాతర.. పూర్తి వివరాలివే..



గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశామన్నారు. ప్రజల కోరిక మేరకు సంక్షేమ పధకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని.. ఉన్న పరిశ్రమల్ని మూసేశారని మండిపడ్డారు.

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు


ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి పెద్ద సంస్థలు వస్తున్నాయన్నారు. విశాఖపట్నంలో కొండలని, గనులను, భూములను దోచుకున్నారని ఆరోపించారు. రుషికొండలో ప్రజల సొమ్ముతో ప్యాలస్‌లు కట్టుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను మొదటి తేదీన అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో అనేక పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని సమాకూరుతాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Bharat Bandh: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరగాల్సిన పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా

Amaravarti : లోకేశ్‌ ఫ్లెక్సీ పెట్టామని హోటల్‌ మూయించారు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 09:24 AM