ప్రధాని విశాఖ పర్యటన రద్దు
ABN , Publish Date - Feb 25 , 2024 | 01:54 AM
ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది. నగరంలోని హెచ్‌పీసీఎల్ విస్తరణ పనులు పూర్తికావడంతో జాతికి అంకితం చేసేందుకు మార్చి ఒకటో తేదీన ప్రధాని వస్తున్నట్టు అధికారులు గతంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని పర్యటన రద్దు అయినట్టు శనివారం సమాచారం అందింది.