Share News

వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:12 AM

గోవింద నామస్మరణతో మందలపర్రు మారు మోగింది. వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం కనులారా చూసేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు.

వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులు

నిడమర్రు జనవరి 28 : గోవింద నామస్మరణతో మందలపర్రు మారు మోగింది. వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం కనులారా చూసేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఆదివారం మందలపర్రులోో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరాస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవ తో ప్రారంభమైన కార్యక్రమం తోమాల సేవ, సహస్రనామార్చన, తిరుమంజనసేవ, ఉస్తవర్ల సమర్పణ జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆకెళ్ల విభీషణశర ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం పగడాల ఆనంద తీర్థాచార్యులు చేసిన ఉపన్యాసం అందరిలో భక్తిభావం పెంపొందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వ హించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం శ్రీవారి కల్యాణం నిర్వహించారు. భక్తులు భక్తిపారవశ్యంతో తరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, ఎమ్మెల్యే పుప్పాల శ్రీని వాసరావులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, టీటీడీ బోర్డు సభ్యుడు నెరుసు సత్యంబాబు, గాదిరాజు సుదర్శనరాజు , సంకు నాగశేషు, కోడే కాశీవిశ్వనాథ్‌, వెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:12 AM