III IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిలిచిన విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Jan 05 , 2024 | 09:40 AM
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
ఏలూరు జిల్లా, జనవరి 5: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో నిన్న (గురువారం) మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హాస్టల్ విద్యార్థులు రాత్రంతా స్నానాలు, నిద్ర లేక అంధకారంలో గడిపారు. పరీక్షల సమయంలో ఎదురైన పవర్ కట్‌తో విద్యార్థిని, విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ సమస్య పరిష్కారం కాకపోవడంతో స్టూడెంట్స్ ఉదయం నుంచి హాస్టల్ గదులకు పరిమితమవ్వాల్సి వచ్చింది. మెస్ నిర్వాహాకులు బయట నుంచి జనరేటర్లు తెప్పించి విద్యార్థులకు అల్పాహారాన్ని సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...