SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ
ABN , Publish Date - May 15 , 2024 | 04:38 PM
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలల్లో ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలను ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల 'కేవైసీ రిజిస్ట్రేషన్' కోసం పాన్‌ను ఆధార్‌తో (pan aadhar link) లింక్ చేయడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. కానీ ప్రస్తుతం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో కేవైసీ రిజిస్ట్రేషన్‌కు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదని సెబీ స్పష్టం చేసింది.
అక్టోబర్‌లో ఆధార్, పాస్‌పోర్ట్ లేదా ఓటరు ID వంటి "అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాల ద్వారా చేయని మ్యూచువల్ ఫండ్(mutual fund) పెట్టుబడిదారులందరినీ మార్చి 31 లోపు వారి KYCని మళ్లీ అప్డేట్ చేయాలని SEBI కోరింది. ఆ క్రమంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ చిరునామాకు రుజువుగా బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలని తెలిపింది. ఆ క్రమంలో పాన్, ఆధార్‌ను లింక్ చేయకపోతే వారి KYC ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆధార్, పాన్ లింక్ చేయకున్నా కూడా వారి ఆధార్ ఆధారిత KYCని నమోదు చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం సెబీ కేవైసీ నిబంధనలు(kyc rules) ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు మళ్లీ KYC అప్డేట్ చేయాలనే కారణంతో వారి మ్యూచువల్ ఫండ్ ఖాతాలు నిలిపివేయబడ్డాయి. దీంతో కొత్త రూల్ అమలు నేపథ్యంలో దాదాపు 1.3 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు సెబీ ఇచ్చిన సడలింపుతో ఈ పెట్టుబడిదారులకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
ఎఫ్ అండ్ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!
Read Latest Business News and Telugu News