Share News

Viral Video: రాధిక మర్చంట్ సోదరిని చుశారా.. చీరలో మాములుగా లేదుగా..

ABN , Publish Date - Jul 08 , 2024 | 10:28 AM

మరో నాలుగు రోజుల్లో అనంత్ అంబానీ(anant ambani), రాధికా మర్చంట్‌(Radhika Merchant)ల పెళ్లి వేడుక జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి రోజు పెళ్లికి ముందు రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే రాధిక మర్చంట్ సోదరి అంజలి మర్చంట్(Anjali merchant), తల్లి శైలా విరేన్ మర్చంట్‌తో కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Viral Video: రాధిక మర్చంట్ సోదరిని చుశారా.. చీరలో మాములుగా లేదుగా..
Radhika Merchant sister Anjali

మరో నాలుగు రోజుల్లో అనంత్ అంబానీ(anant ambani), రాధికా మర్చంట్‌(Radhika Merchant)ల పెళ్లి వేడుక జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి రోజు పెళ్లికి ముందు రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అంబానీ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ గ్రహ శాంతి పూజ(Graha Shanti Puja) కార్యక్రమం నిర్వహించారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలోనే రాధిక మర్చంట్ సోదరి అంజలి మర్చంట్(Anjali merchant), తల్లి శైలా విరేన్ మర్చంట్‌తో కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జూలై 7న శైలా మర్చంట్, వీరేన్ మర్చంట్ తమ కుమార్తె రాధిక కోసం ఇంట్లో గ్రహ శాంతి పూజ నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భంలో అనంత్ అంబానీ వధువు సౌత్ ఇండియన్ చీరలో అందంగా కనిపించారు. మరోవైపు ఆమె సోదరి అంజలి మర్చంట్ కూడా ప్రత్యేక చిరలో ఆభరణాలు ధరించి కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ రాధిక సోదరి కూడా చాలా అందంగా ఉందని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాధిక సోదరి(Anjali merchant) ఎలా ఉందో ఈ వీడియో చూసి మీరు కూడా తెలుసుకోండి మరి.


3 రోజుల పాటు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలు(marriage celebrations) ఇప్పటికే మొదలు కాగా, జూలై 12న అనంత్, రాధిక పెళ్లి చేసుకోబోతున్నారు. జియో వరల్డ్ సెంటర్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కళ్యాణంలో రెండో రోజు జూలై 13న అంగరంగ వైభవంగా ఆశీర్వాద కార్యక్రమం, ఆ తర్వాత జులై 14న రిసెప్షన్ ఉంటుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం కానుంది. మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా నిర్వహించడంతో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


ఇది కూడా చదవండి:

Rains: 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. మరో 11 రాష్ట్రాలకు అలర్ట్

NEET UG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. పరీక్షలో అవకతవకలు సహా 38 పిటిషన్లు

For Latest News and Business News click here

Updated Date - Jul 08 , 2024 | 10:37 AM