Stock Market: మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్.. కొనసాగుతున్న నష్టాలు..
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:23 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, చైనా పాలసీ మేకింగ్ నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, చైనా పాలసీ మేకింగ్ నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలతో సెన్సెక్స్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్టం అయిన 84.12కి పడిపోయింది (Business News).
సోమవారం ముగింపు (79, 782)తో పోల్చుకుంటే 250 పాయింట్ల నష్టంతో 78, 542 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయిట్లు కోల్పోయింది. దాదాపు 340 పాయింట్లు కోల్పోయి 78, 455 వద్ద కనిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 11:15 గంటల సమయంలో సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో 78, 676 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 90 పాయింట్లకు పైగా కోల్పోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ ప్రస్తుతం 28 పాయింట్ల నష్టంతో 23, 966 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో జుబిలెంట్ ఫుడ్స్, వొడాఫోన్ ఐడియా, జేఎస్‌డబ్ల్యూ, ఎన్‌ఎమ్‌డీసీ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. ఏబీబీ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, అదానీ పోర్ట్స్, లూపిన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 278 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.12గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..