Stock markets: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1241 పాయింట్లు జంప్
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:47 PM
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. విపరీతమైన కొనుగోళ్లు నమోదు కావడంతో మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. విపరీతమైన కొనుగోళ్లు నమోదు కావడంతో మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు మార్కెట్‌కు మంచి గ్లోబల్ సంకేతాలు తోడవడంతో హెవీవెయిట్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లకు మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 1241 పాయింట్లు జంప్ చేసి 71,941కి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 385 పాయింట్లు పెరిగి 21,737 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు సైతం 576, 770 పాయింట్లు వృద్ధి చెందాయి.
ఈ క్రమంలో బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్, మెటల్ రంగాల్లో మార్కెట్‌లో గరిష్ఠ కొనుగోళ్లు నమోదయ్యాయి. అంతకుముందు గురువారం సెన్సెక్స్ 359 పాయింట్లు పడిపోయి 70,700 వద్ద ముగిసింది.
ఈ క్రమంలో ONGC, RIL, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా.. సిప్లా, ITC, LTmindtree, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో సంస్థల షేర్లు టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి ముందు పెట్టుబడిదారులు US ఆర్థిక డేటాను స్టాక్ చేయడంతో US డాలర్ సోమవారం స్థిరంగా ఉంది.