Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..
ABN , Publish Date - Nov 15 , 2024 | 09:55 AM
భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.
మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు లేదా మనీ సేవింగ్స్ చేస్తే మంచిది. ఇప్పుడు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తేనే తర్వాత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అయితే 2050 నాటికి అంటే ఇంకో 26 ఏళ్లకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా కోటి రూపాయల విలువ ఎంత ఉంటుంది. ఈ ప్రశ్నకు ఏఐ ChatGPT చెప్పిన సమాధానం అనేక మందిని ఆశ్యర్యానికి గురి చేస్తుంది. 2050లో కోటి రూపాయల విలువ అంత తక్కువగా ఉంటుందా అని పలువురు అనుకుంటున్నారు. అయితే ఏఐ చెప్పిన సమాధానాలు ఎలా ఉన్నాయనే అనే విశేషాలను ఇప్పుడు చుద్దాం.
ద్రవ్యోల్బణం రేటు ప్రభావం
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ChatGPT ద్రవ్యోల్బణ రేటును ఒక ప్రధానమైన అంశంగా ప్రస్తావించింది. 2050లో కోటి రూపాయల విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే ద్రవ్యోల్బణం రేటు గురించి కూడా తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణం రేటు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు 6%గా అంచనా వేసింది చాట్ జీపీటీ. ఈ క్రమంలో 2050 నాటికి కోటి రూపాయల వాస్తవ విలువను లెక్కించేందుకు ChatGPT ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించింది. ఏటా పెరుగుతున్న ధరల వల్ల దాని వాస్తవ విలువపై కూడా ప్రభావం పడుతుందని తెలిపింది.
AI ద్వారా 1 కోటి విలువ
ఇందులో ప్రస్తుత విలువ రూ. 1 కోటి, ద్రవ్యోల్బణం రేటు 6% (0.06). తీసుకున్న సమయం 26 సంవత్సరాలు (2024 నుంచి 2050 వరకు). ఈ లెక్కన ఏడాదికి సగటు ద్రవ్యోల్బణం 6% ఉంటే, 2050లో కోటి రూపాయల కొనుగోలు శక్తి రూ. 23.35 లక్షలకు సమానం. అంటే నేటితో పోలిస్తే ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే 26 ఏళ్లలో రూ.1 కోటి దాదాపు 76% తగ్గుతుందంటా. దీని అర్థం సాధారణంగా ప్రతిదీ ఖరీదైనదిగా మారుతుందని తెలిపింది.
కామెంట్లు కూడా..
ఇదే ప్రశ్నకు మరో సమాధానంలో ద్రవ్యోల్బణాన్ని ఊహించి 2050లో కోటి రూపాయల కొనుగోలు శక్తి రూ. 42.91 లక్షలు ఉండవచ్చని చెప్పడం విశేషం. వాస్తవ విలువ ఆ సమయంలో ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని కూడా ప్రకటించింది. ఈ సమాధానం చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రకారం వేతనాలు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఇంకొంత మంది మాత్రం ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటి నుంచి కోటి రూపాలు పొదుపు చేస్తే 2050 ఏ మాత్రం సరిపోవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 కోట్ల సేవింగ్ ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More International News and Latest Telugu News