Bond Trading : మునిసిపల్ బాండ్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:41 AM
దేశంలో మునిసిపల్ బాండ్స్ మార్కెట్‌ను పటిష్ఠం చేసేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) చర్యలు చేపట్టింది.

ఎన్‌ఎస్ఈ
న్యూఢిల్లీ: దేశంలో మునిసిపల్ బాండ్స్ మార్కెట్‌ను పటిష్ఠం చేసేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో మార్కెట్లో ఉన్న మునిసిపల్ బాండ్స్ ఇష్యూలు, వాటి పరపతి రేటింగ్, ట్రేడవుతున్న బాండ్ల సంఖ్య, ఆయా బాండ్స్‌పై లభించే నికర రాబడులు, వాటి ప్రస్తుత ధర, నిఫ్టీ ఇండియా మునిసిపల్ బాండ్ ఇండెక్స్ పనితీరుతో సహా సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపింది. మునిసిపల్ బాండ్స్‌పై అవగాహన, పారదర్శకత, అమ్మకాలు, కొనుగోళ్లకు కూడా ఈ వెబ్‌సైట్ ఎంతగానే ఉపయోగపడనుంది.
టాటా పవర్ అరుదైన ఘనత..
టాటా పవర్ రూఫ్‌టాప్ సోలార్ రంగంలో అరుదైన మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేసిన ఈ సంస్థ, మొత్తం 3 గిగావాట్ల (GW) సామర్థ్యంతో ఈ రంగంలో అగ్రగామిగా నిలిచింది. దీని సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700కు పైగా నగరాల్లో విస్తరించి ఉన్నాయి. గత 10 ఏళ్లుగా బ్రిడ్జ్ టు ఇండియా (BTI) గుర్తింపు పొందిన టాటా పవర్, ‘హర్ ఘర్ సోలార్’ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PMSGY)లక్ష్యం దిశగా కదులుతోంది. తమిళనాడులోని అత్యాధునిక ప్లాంట్‌లో ALMM సర్టిఫికేషన్ పొందిన సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తూ, ఈ పథకానికి సాధికారత కల్పిస్తోంది.