Swiggy IPO: రేపే స్విగ్గీ ఐపీఓ! మరి ఈ సంస్థను ముందుండి నడిపించేదెవరో తెలుసా?
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:32 PM
స్విగ్గీ భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపడుతున్నందున సంస్థ మేనేజ్‌మెంట్ టీం, వ్యవస్థాపకలు ఎవరో తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు సహజంగానే ఆసక్తి చూపుతారు. మరి సంస్థ నాయకత్వ బృందంలో ఎవరెవరున్నారంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ హోం డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. రూ.11,300 కోట్ల సమీకరణ కోసం నవంబర్ 6-8 మధ్య ఐపీఓను కొనసాగించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేటి నుంచే షేర్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపడుతున్నందున స్విగ్గీ మేనేజ్‌మెంట్ టీం, వ్యవస్థాపకులు ఎవరో (Swiggy Management Team) తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు సహజంగానే ఆసక్తి చూపుతారు. మరి సంస్థ నాయకత్వ బృందంలో ఎవరెవరున్నారంటే..
BSNL Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
స్విగ్గీ మేనేజ్‌మెంట్ టీం ఇదే!
స్విగ్గీ ఎండీ, గ్రూప్ సీఈఓగా ఉన్న శ్రీహర్ష మాజేటి సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. శ్రీహర్ష బిట్స్ పిలానీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అనంతరం ఐఐఎమ్ కలకత్తా నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.
లక్ష్మీ నందన్ రెడ్డి ఓబుల్: 2014లో స్విగ్గీలో చేరిన లక్ష్మీ నందన్‌రెడ్డి సంస్థ ఇన్నోవేషన్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఫుల్ టైం డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. బిట్స్ పిలానీ నుంచి సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన గతంలో ఇంటెల్లీకాప్‌లో బిజినెస్ కన్సల్టింగ్ విభాగం అసోసియేట్‌గా చేశారు.
రోహిత్ కపూర్: ఈయన స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2022 ఆగస్టు 16న రోహిత్ స్విగ్గీలో చేరారు. ఐఐఎమ్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రోహిత్ చార్టెర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్టు లెవెల్ 3 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఆయన ఓయోలో గ్లోబల్ సీఎమ్ఓగా చేశారు.
Bank lockers: బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే...
ఫణి కిషన్ అడ్డెపల్లి: ఆయన చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా ఉన్నారు. అడర్వ్‌టైజింగ్ రెవెన్యూ, యూజర్ గ్రోత్ బాధ్యతలు చూస్తుంటారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఐఐఎమ్ కలకత్తా నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.
రాహుల్ బోత్రా: వ్యాపారఆర్థిక ఆంశాల్లో విశేషానుభవం ఉన్న రాహుల్ బోత్రా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. అకౌంటింగ్, ట్రెజరీ, బిజినెస్ ఫైనాన్స్, టాక్సేషన్, మర్జర్స్ అండ్ ఎక్విసిషన్స్, తదితర అంశాల్లో అంతర్జాతీయంగా విశేష అనుభవం గడించారు. ఆయన గతంలో బ్రిటానియా, విప్రో, ఓలామ్ ఇంటర్నేషనల్ సంస్థల్లో సేవలందించారు.
మధుసూదన్ రావు సుబ్బారావు: ఈయన సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఐఐటీ ఢిల్లీ నుంచి డిగ్రీ, పీజీ చేశారు. ఐఐఎమ్ అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. గతంలో ఆయన ఫ్లిప్‌కార్ట్‌లో 14 ఏళ్ల పాటు సేవలందించారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు..
బోర్డు ఆఫ్ డెరెక్టర్లు
ఆనంద్ కృపాలు - చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్
శ్రీహర్ష మాజేటి - మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ
లక్ష్మీ నందన్ రెడ్డి ఓబుల్ - హోల్ టైం డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్
శైలేష్ విష్ణూభాయ్ హరిభక్తి - ఇండిపెండెంట్ డైరెక్టర్
సాహిల్ బారువా - ఇండిపెండెంట్ డైరెక్టర్
సుపర్నా మిత్రా - ఇండిపెండెంట్ డైరెక్టర్
ఆనంద్ డానియెల్ - నామినీ డైరెక్టర్ (నాన్ ఎగ్జిక్యూటివ్)
ఆషుతోశ్ శర్మ - నామినీ డైరెక్టర్ (నాన్ ఎగ్జిక్యూటివ్)
సుమేర్ జునేజా - నామినీ డైరెక్టర్ (నాన్ ఎగ్జిక్యూటివ్)
రాజర్ క్లార్క్ - నామినీ డైరెక్టర్ (నాన్ ఎగ్జిక్యూటివ్)