Share News

Hyderabad: క్వారీ గుంతలో మునిగి బాలుడి మృతి..

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:55 AM

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు క్వారీ గుంతలో మునిగి మృతి చెందాడు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కైసర్‌నగర్‌లో నివాసం ఉండే సల్మాన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు సోయల్‌(10) కైసర్‌నగర్‌లోని మదర్సాలో చదువుతున్నాడు.

Hyderabad: క్వారీ గుంతలో మునిగి బాలుడి మృతి..

హైదరాబాద్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు క్వారీ గుంతలో మునిగి మృతి చెందాడు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కైసర్‌నగర్‌లో నివాసం ఉండే సల్మాన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు సోయల్‌(10) కైసర్‌నగర్‌లోని మదర్సాలో చదువుతున్నాడు. సోమవారం స్కూల్‌కు సెలవు కావడంతో అదే ప్రాంతంలో ఉంటున్న మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోయల్‌ ప్రగతినగర్‌ సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. క్వారీ గుంతలో దిగిన ముగ్గురు బయటకు రాగా ప్రమాదవశాత్తు సోయల్‌(Soyal) క్వారీ గుంతలోని రాళ్లలో ఇరుక్కపోయాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి...


దీంతో బయటకు రాలేక నీళ్లలోనే మునిగిపోయాడు. స్నేహితులు వారి బస్తీకి వచ్చి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న బస్తీవాసులు క్వారీ గుంత వద్దకు చేరుకొని, జగద్గిరిగుట్ట((Jagadgirigutta)) పోలీసులకు సమాచారం అందించారు. క్వారీ గుంతలోకి స్థానికులు దిగి సోయల్‌ను వెతికి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాధచాయలు అలుముకున్నాయి. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదుకొని దర్యాప్తు చేస్తున్నారు.

city2.2.jpg


ఇదికూడా చదవండి: Bellampalli: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2024 | 10:55 AM