Share News

Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

ABN , Publish Date - Aug 10 , 2024 | 10:12 AM

ఓ రౌడీషీటర్‌(Rowdy sheeter)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన బాలాపూర్‌ పోలీసుస్టేషన్‌(Balapur Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన రియాజ్‌ (45)పై రౌడీషీట్‌ నమోదైంది.

Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

- బాలాపూర్‌లో రౌడీషీటర్‌ హత్య

హైదరాబాద్: ఓ రౌడీషీటర్‌(Rowdy sheeter)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన బాలాపూర్‌ పోలీసుస్టేషన్‌(Balapur Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన రియాజ్‌ (45)పై రౌడీషీట్‌ నమోదైంది. గురువారం అర్ధరాత్రి తన బైక్‌పై బాలాపూర్‌ చౌరస్తాకు వెళుతుండగా ఓ స్కూల్‌ సమీపంలో గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో అమ్మాయిల నకిలీ వివరాలతో మోసం..


రియాజ్‌ కింద పడిపోగానే కళ్లల్లో కారం చల్లి రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. అంతటితో ఆగకుండా రాడ్డుతో తలపై బలంగా మోదారు. స్థానికుల ద్వారా సమాచారమందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో రౌడీషీటర్‌తో వైరం

అయితే, రియాజ్‌కు హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన మరో రౌడీషీటర్‌తో వైరం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు గతంలో జరిగిన కొన్ని హత్య కేసుల్లో రియాజ్‌ నిందితుడు.


city4.jpg

ఆయన చేతిలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు హతమార్చారా ? వైరమున్న రౌడీషీటర్‌లు ఎవరైనా హత్య చేశారా ? లేక ఆర్థిక లావాదేవీలు కారణమా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా(CC camera)లను పరిశీలిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలాన్ని రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు మహేశ్వరం డీసీపీ, ఏసీపీలతో కలిసి పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 10:12 AM