Hyderabad: చిట్టీ డబ్బు ఇవ్వడం లేదని చంపేశాడు..
ABN , Publish Date - Oct 10 , 2024 | 08:00 AM
చిట్టీ డబ్బు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో ఓ ఆటోడ్రైవర్ మహిళను హత్య చేశాడు. ఎల్లారెడ్డిగూడ(Ellareddyguda) ప్రాంతంలో సెప్టెంబరు 30న జరిగిన ఆర్‌ఎంపీ భార్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- ఆర్‌ఎంపీ సతీమణి హత్య కేసులో నిందితుడి అరెస్టు
హైదరాబాద్: చిట్టీ డబ్బు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో ఓ ఆటోడ్రైవర్ మహిళను హత్య చేశాడు. ఎల్లారెడ్డిగూడ(Ellareddyguda) ప్రాంతంలో సెప్టెంబరు 30న జరిగిన ఆర్‌ఎంపీ భార్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో నివసిస్తున్న ఉమామహేశ్వరరావు(Umamaheswara Rao) అనే ఆర్‌ఎంపీ భార్య సుధారాణి(44), ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెప్టెంబరు 30న ఉమామహేశ్వరరావు తన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేసరికి సుధారాణి రక్తపుముడుగులో కనిపించింది. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సుధారాణి గొంతు కోసి చంపిన దుండగులు ఇంట్లో బంగారాన్ని అపహరించినట్లు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దీపావళికి 2 డీఏలు!
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. భుజాన బ్యాగు వేసుకుని కాలనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తిరిగి సూట్‌కేసుతో వెళ్లడాన్ని సీసీ కెమెరా ఫుటేజీల్లో గుర్తించారు. సుధారాణి కాల్‌డేటా పరిశీలించగా హత్యకు ముందు ఒకే నంబర్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ ఉన్నట్టు కనిపెట్టారు. ఈ రెండింటి ఆధారంగా వరంగల్ జిల్లా కాజీపేట(Kazipet)కు చెందిన షేక్‌జావెద్ అలియాస్ జావెద్ ఖాన్ అనే ఆటోడ్రైవర్‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. జావెద్ ఖాన్ చిట్టీ నిమిత్తం సుధారాణి(Sudharani)కి ప్రతి నెలా రూ.10 వేలు చెల్లించాడు.
చిట్టీ పూర్తయినా తనకు రావాల్సిన రూ.2.80 లక్షలను సుధారాణి ఇవ్వకపోగా, డబ్బు కోసం ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుని కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెను హతమార్చాలని పథకం వేసి సెప్టెంబరు 27, 28 తేదీల్లో విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో 30వ తేదీన సుధారాణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి కత్తితో ఆమె పీక కోసి ఇంట్లో ఉన్న నగల పెట్టె తీసుకుని పారిపోయాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి 6.5 తులాల బంగారు ఆభరణాలు, కత్తి, ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..
ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం
ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు
ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్
Read Latest Telangana News and National News