Share News

Hyderabad: భార్యకు ఫోన్‌ చేసి బలవన్మరణం..

ABN , Publish Date - Dec 28 , 2024 | 08:49 AM

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రం భువనగిరిలోని ఎస్వీ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Hyderabad: భార్యకు ఫోన్‌ చేసి బలవన్మరణం..

- ఈ నెల 18న భువనగిరిలో ఘటన

- చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి

భువనగిరి: యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రం భువనగిరిలోని ఎస్వీ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పట్ట ణ ఎస్‌ఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా రాయపల్లి మండలం కొండూరు గ్రామానికి చెందిన కర్రె రాజిరెడ్డి(45) ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి కొద్దికాలంగా హైదరాబాద్‌ బోయినిపల్లి ఉమానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేశారని ఉద్యోగిపై వినియోగదారుడి దాడి


ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజిరెడ్డి(Raji Reddy) మరుస టి రోజు వరకు ఇంటికి వెళ్లకపోవడంతో భార్య కర్రె సరళ బోయినిపల్లి పోలీస్‏స్టేషన్‌(Boinipalli Police Station)లో 17వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకు రాజిరెడ్డి భార్యకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందును తాగుతూ వీడియో కాల్‌ చేసి అడ్రస్‌ చెప్పాడు.


city2.2.jpg

దీంతో ఆమె ఏడుస్తూ అడ్రస్‌ చెప్పాలని ప్రాధేయపడగా భువనగిరి(Bhuvanagiri) ఎస్వీ లాడ్జి లొకేషన్‌ను షేర్‌ చేశాడు. ఆమె సమాచారంతో భువనగిరి పట్టణ పోలీసులు(Bhuvanagiri Town Police) ఎస్వీ లాడ్జికి చేరుకొని జిల్లాఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 08:49 AM