Maha Shivratri 2024: మహాదేవుడికి ప్రీతిపాత్రమైన రాశిఫలాలివేనట..!
ABN , Publish Date - Mar 08 , 2024 | 05:54 PM
Maha Shivratri 2024: మహాశివరాత్రి రోజున భక్తులు పరమేశ్వరుడిని(Lord Shiva) ఆరాధిస్తారు. తద్వారా శివుడి ఆశీస్సులను పొందుతారు. భక్తిప్రపత్తులతో ఈశ్వరుడిని పూజిస్తే.. కష్టాలు తొలగిపోతాయని, కోరికలను నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. అయితే, పురాణాల ప్రకారం.. ఆ మహాదేవుడికి కొన్ని రాశిఫలాలు(Zodiac Signs) అంటేచాలా ఇష్టమట. ఆ రాశుల వారిపై శివుడి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటుందట.
Maha Shivratri 2024: మహాశివరాత్రి రోజున భక్తులు పరమేశ్వరుడిని(Lord Shiva) ఆరాధిస్తారు. తద్వారా శివుడి ఆశీస్సులను పొందుతారు. భక్తిప్రపత్తులతో ఈశ్వరుడిని పూజిస్తే.. కష్టాలు తొలగిపోతాయని, కోరికలను నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. మహాదేవుడు తనను నమ్ముకున్న భక్తులకు కష్టాలు రాకుండా కాపాడుతాడని అంటారు. అయితే, పురాణాలు, కొందరు వేద పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆ మహాదేవుడికి కొన్ని రాశిఫలాలు(Zodiac Signs) అంటే ఇష్టమట. మరి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన రాశిఫలాలు ఏంటి? ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? వేద పండితులు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దాం..
శివుడికి ప్రీతికరమైన రాశులు ఇవేనట..!
వృషభం: శివుని వాహనం నంది. నంది అంటే శివుడికి చాలా ఇష్టం. నందీశ్వరుడిని ద్వారపాలకుడు, శివుడి దూతగా కూడా పిలుస్తారు. కాలచక్రంలోని వృషభ రాశితో నందీశ్వరుడికి సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగా వృషభ రాశి శివుడికి ఇష్టమైన రాశిగా పేర్కొంటున్నారు నిపుణులు.
మిథునరాశి: ఈ రాశి అర్ధనారీశ్వరునికి సంబంధించినది. శివుడు, శక్తి కలిసి అర్థనారీశ్వరుని రూపంలో ఉంటారు. మిథునరాశి అంటే స్త్రీ, పురుష జంట. అందుకే మిథున రాశి కూడా శివుడికి ప్రతీకరమైందిగా చెబుతున్నారు పండితులు.
కర్కాటక రాశి: కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడుని మహాదేవుడు తన తలనపై అలంకరించుకున్నాడు. కర్కాటక రాశి కూడా స్వామివారికి ఇష్టమైందిగా పేర్కొంటున్నారు.
ధనుస్సు: ధనుస్సు రాశికి చిహ్నం విల్లు. పరమేశ్వరుడికి కూడా పినాకి విల్లు ఉంది. అది వినాశన సమయంలో ఉపయోగించడం జరిగింది. విల్లుకు చిహ్నంగా ఉన్న ధనుస్సు రాశి కూడా శివునికి ఇష్టమైన రాశిచక్చరంగా పేర్కొంటున్నారు నిపుణులు.
కుంభం: శివునికి ఇష్టమైన రాశిచక్రాలలో కుంభం కూడా ఒకటి అని చెబుతున్నారు పండితులు. శివుని తలపై వెంట్రుకలో గంగాదేవి నెలవై ఉంది. భగీరథుడు గంగను భూమిపైకి ఆహ్వానించినప్పుడు.. శివుడు తన జటాజూటాన్ని కుంభంగా మార్చి గంగా ప్రవాహాన్ని నియంత్రించగలిగాడని అంటున్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. మతగ్రంధాలు, వేద పండితులు అందించిన సమాచారం మేరకు, ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..