Share News

Jobs: ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐలో 1511 పోస్టులకు అప్లై చేశారా లేదా..

ABN , Publish Date - Sep 16 , 2024 | 09:24 AM

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1511 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

Jobs: ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐలో 1511 పోస్టులకు అప్లై చేశారా లేదా..
1511 sbi jobs

బ్యాంకుల్లో ఉద్యోగం(jobs) చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1511 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను నియమించుకోనున్నారు. వీటి కోసం ఇటివల నోటిఫికేష్ రాగా, ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఫీజు ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


విద్యార్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 50%తో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాలలో B.Tech లేదా B.E. డిగ్రీ కలిగి ఉండాలి. ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, మీరు కూడా అప్లై చేయా చేయాలంటే అక్టోబర్ 4, 2024 వరకు sbi.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1511 ఖాళీలలో 1497 సాధారణ ఖాళీలు, 14 బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి.


వయో పరిమితి

SBIలో డిప్యూటీ మేనేజర్ పోస్ట్‌కి వయోపరిమితి 25 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కి ఇది 21 నుంచి 37 సంవత్సరాలుగా ఉంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో వయస్సు 30 జూన్ 2024 నాటికి లెక్కించబడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో ప్రత్యేక సడలింపు ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ

డిప్యూటీ మేనేజర్ పోస్టుకు ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్-కమ్-టైర్డ్/లేయర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూకు అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే కటాఫ్ మార్కులను పొందినట్లయితే, అటువంటి అభ్యర్థులు మెరిట్ జాబితాలో వారి వయస్సు ప్రకారం ర్యాంక్ చేయబడతారు.

ఇంటర్వ్యూ

అసిస్టెంట్ మేనేజర్ ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష బహుశా నవంబర్ 2024లో ఉండవచ్చు. పరీక్షలో 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మొత్తం మార్కులు 100 ఉంటాయి. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు. ఆన్‌లైన్ రాత పరీక్షలో వారి పనితీరు ఆధారంగా బ్యాంక్ కేటగిరీల వారీగా నిర్ణయించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది.


ఫీజు ఎంత?

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 750. SC/ST/PWBD అభ్యర్థులకు ఫీజు లేదు. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరింత సమాచారం కోసం మీరు SBI sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


SBI రిక్రూట్‌మెంట్ 2024: ఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) – ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ & డెలివరీ: 187 పోస్టులు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) – ఇన్‌ఫ్రా సపోర్ట్ & క్లౌడ్ ఆపరేషన్: 412 పోస్టులు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - నెట్‌వర్కింగ్ ఆపరేషన్: 80 పోస్టులు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - IT ఆర్కిటెక్ట్: 27 పోస్టులు

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7 పోస్టులు

  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 784 పోస్టులు


ఇవి కూడా చదవండి:

Local Media : ‘శంకర్‌ దాదా.. ఎంబీబీఎస్’లు!

Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreEducation News and Latest Telugu News

Updated Date - Sep 16 , 2024 | 09:32 AM