Loksabha Polls: నువ్వు పొత్తు పెట్టుకున్న కూటమి ఏది?.. కేసీఆర్‌కు పొంగులేటి సూటి ప్రశ్న
ABN , Publish Date - Apr 30 , 2024 | 10:16 AM
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. మతతత్వం రెచ్చగొట్టే బీజేపీకి కానీ, మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దని కోరారు. రాష్ట్రంలో లక్ష 50 వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుద్దుడు కేసీఆర్ అని ఆరోపించారు.
ఖమ్మం, ఏప్రిల్ 30: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (BRS Chief KCR) మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. మతతత్వం రెచ్చగొట్టే బీజేపీకి (BJP) కానీ, మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్‌కు (BRS) ఓటు వేయొద్దని కోరారు. రాష్ట్రంలో లక్ష 50 వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుద్దుడు కేసీఆర్ అని ఆరోపించారు.
JP Nadda: వికసిత్ భారత్ కోసమే ఈ ఎన్నికల..
‘‘ఆయన కాలు విరగకొట్టుకుని కర్ర పట్టుకునీ ఖమ్మం వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాడు. కూటమిలో ప్రధాని అవుతారని, బీఆర్ఎస్ అభ్యర్థి కేంద్ర మంత్రి అవుతారని కలలు కంటున్నాడు. నువ్వు పొత్తు పెట్టుకున్న కూటమి ఏది? నువ్వు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నవని ఖమ్మం సాక్షిగా చెప్పకనే చెప్పావ్’’ అంటూ కేసీఆర్‌పై మంత్రి విమర్శలు గుప్పించారు.
Karnataka: కర్ణాటకలో డర్టీ పిక్చర్.. రాజకీయాల్లో కుదుపు
రఘురాంరెడ్డిని గెలిపించండి....
కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు బలపరిచిన వ్యక్తి రామసాయం రఘురాం రెడ్డి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీనీ (Raghul Gandhi) ప్రధాన మంత్రిని చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..
160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
Read Latest Telangana News And Telugu News