Glycemic Foods: ఈ ఆహారాలు తినండి చాలు.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు..!
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:45 PM
ఈ మధ్య కాలంలో మధుమేహం కేసులు పెరుగుతూ ఉండటంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఆహారానికి గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది మధమేహం ఉన్నవారు ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా అవసరం. తినే ఆహారం మీద శరీర స్థితి ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మధుమేహం కేసులు పెరుగుతూ ఉండటంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఆహారానికి గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది మధమేహం ఉన్నవారు ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఈ కింది ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
ఓట్స్..
ఆరోగ్యకరమైన ఆహారాలలో ఓట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 55. దీన్ని మధుమేహం ఉన్నవారు నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది.
ఈ మసాలా దినుసులు తింటే చాలు.. పొట్ట కొవ్వు తగ్గిపోతుందట..!
క్యారెట్లు..
క్యారెట్ల గ్లైసెమిక్ ఇండెక్స్ 39. చాలామంది మధుమేహం ఉన్నవారు క్యారెట్లు తినడం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కానీ మధుమేహం ఉన్నవారు క్యారెట్లను తీసుకోవడం సురక్షితం.
కిడ్నీ బీన్స్..
తక్కువ గ్లైసెమిక్ ఉండెక్స్ ఉన్న ఆహారాలలో కిడ్నీ బీన్స్ ప్రధానమైనవి. మధుమేహం ఉన్న వారికి కిడ్నీ బీన్స్ చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
యాపిల్..
యాపిల్ లో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉండేందుకు, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి.
వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!
బార్లీ..
బార్లీ నీటిలో అధిక స్థాయిలో కరికే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే మూత్రవిసర్జన, బయోయాక్టీవ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.
శనగలు..
మధుమేహం ఉన్నవారికి శనగలు చాలా మంచి ఎంపికైన ఆహారం. శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ 28. పైగా ఇందులో ప్రోటీన్, పైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు శనగలు ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
కాయధాన్యాలు..
కాయ ధాన్యాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 32. మధుమేహం ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి.
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.