Nita Ambani: నీతా అంబానీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఈ టిప్స్ ఫాలో అవ్వడం చాలా ఈజీ..!
ABN , Publish Date - Jul 08 , 2024 | 02:00 PM
60ఏళ్ల వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షించే నీతా అంబానీ రోజువారీ పాటించే కొన్ని అలవాట్లు పాటిస్తుంది. అవే ఆమెను ఫిట్ గా ఉంచుతున్నాయట. ఈ ఫిట్ టిప్స్ ను అందరూ పాటించవచ్చని అంటున్నారు.
భారతీయ అపర కుబేరుడు, భారత్ లో అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ సతీమణిగా నీతా అంబానీ అందరికీ సుపరిచితమే. ఈమె ఒక ధనవంతుడి భార్యగానే కాకుండా మహిళా వ్యాపారవేత్తగానూ, ధీరూభాయ్ ఫౌండేషన్ ద్వారా విద్యతో పాటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే మహిళగా కూడా గుర్తింపు పొందింది. అన్నింటి కంటే ముఖ్యంగా నీతా అంబానీ తన లైఫ్ స్టైల్ కారణంగా ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటారు. ప్రస్తుతం 60ఏళ్ల వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షించే నీతా అంబానీ రోజువారీ పాటించే కొన్ని అలవాట్లు పాటిస్తుంది. అవే ఆమెను ఫిట్ గా ఉంచుతున్నాయట. ఈ ఫిట్ టిప్స్ ను అందరూ పాటించవచ్చని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
ఆహారం..
సమతుల ఆహారం తీసుకోవడంలో నీతా అంబానీ ఎప్పుడూ కాంప్రమైజ్ కారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇలా అన్నీ సమతుల్యంగా అందేలా చూసుకుంటారు. అంతేకాదు.. ఏ ఆహారాన్ని అతిగా తినకుండా మితంగా తీసుకుంటారు.
నీరు, నిమ్మకాయ రసం..
నీతా అంబానీ తన రోజును గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడంతో మొదలు పెడతారట. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరం హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో మెరుగ్గా సహాయపడుతుంది.
శాకాహారం..
మాంసాహారంలో ప్రోటీన్లు ఉంటాయని, అవి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని అందరూ అనుకుంటారు. అయితే నీతా అంబానీ మాంసాహారం తినరు. ఆమె పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటారు. ఇవన్నీ శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గిస్తాయి.
వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!
బీట్ రూట్..
నీతా అంబానీ డైట్ లో బీట్ రూట్ తప్పనిసరిగా ఉంటుందట. బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తీసుకుంటారు. బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి శక్తిని ఇస్తుంది. రక్తపోటును తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రాసెస్ ఫుడ్స్..
ప్రాసెస్ చేసిన ఆహారాలను నీతా అంబానీ అసలు ముట్టరు. వీటి బదులు శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలను ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటారు.
యోగా..
శరీరం ఫిట్‌నెస్ గా, బలంగా ఉండటం కోసం.. మానసికంగా కూడా బలంగా ఉండటం కోసం వివిధ యోగా ఆసనాలు వేస్తారు. యోగాను తన లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంటారు. కేవలం యోగా మాత్రమే కాకుండా కార్డియో వాస్కులర్ వ్యాయామాలు, శరీరంలో కండరాలు బలపడటానికి చేసే వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని నీతా అంబానీ తప్పకుండా ఫాలో అవుతారు.
ఈ మసాలా దినుసులు తింటే చాలు.. పొట్ట కొవ్వు తగ్గిపోతుందట..!
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.