Share News

Shampoo: షాంపూ కూడా విషంలా ప్రభావం చూపిస్తుందా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:20 AM

అమ్మాయిలకు పొడుగాటి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం హెయిర్ ఆయిల్ నుండి షాంపూ వరకు ప్రతి ఒకటి ట్రై చేస్తారు. చాలామంది టీవీ యాడ్స్, సోషల్ మీడియా లో ప్రమోషన్స్ చూసి షాంపూలు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ..

Shampoo: షాంపూ కూడా విషంలా ప్రభావం చూపిస్తుందా? ఈ నిజాలు తెలిస్తే..!
Shampoo Facts

జుట్టు పొడవుగా, మందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు పొడుగాటి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం హెయిర్ ఆయిల్ నుండి షాంపూ వరకు ప్రతి ఒకటి ట్రై చేస్తారు. చాలామంది టీవీ యాడ్స్, సోషల్ మీడియా లో ప్రమోషన్స్ చూసి షాంపూలు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ షాంపూని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. షాంపూ బాటిల్ లేబుల్ మీద ఈ కింది విషయాలు చెక్ చేయాలి.. లేదంటే కొనుగోలు చేసిన షాంపూ జుట్టుకు విషంలా మారుతుంది. జుట్టుకు హాని జరిగి అది క్రమంగా బట్టతలకు దారి తీస్తుంది.

షాంపూల తయారీలో కొన్ని హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. ఇవి తల చర్మాన్ని, కుదుళ్లను బలహీనం చేసి జుట్టును బలహీన పరుస్తాయి. క్రమంగా ఇవి జుట్టు రాలిపోయి బట్టతలకు కారణం అవుతాయి. షాంపూ బాటిల్ మీద ఏమేం చెక్ చేయాలంటే..

వినాయక చవితికి మిల్లెట్స్ తో కుడుములు ఇలా చేయండి..!


సోడియం లారిల్ సల్ఫేట్..

సోడియం లారిల్ సల్ఫేట్ చాలా షాంపూల తయారీలో ఉపయోగించబడుతుంది. ఇది జుట్టును శుభ్రపరుస్తుంది. ఇది స్కాల్ప్‌లోని మురికిని శుభ్రం చేయడానికి పనిచేసినప్పటికీ దాని ఫలితంగా ఇది తలకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టును పొడిగా, నిర్జీవంగా మార్చి జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల షాంపూ తీసుకునే ముందు షాంపూ తయారీలో ఈ రసాయనం వాడారా లేదా ఖచ్చితంగా తనిఖీ చేయాలి.

పెట్రోలియం..

మినరల్ ఆయిల్, మైనపు తయారీకి పెట్రోలియం ఉపయోగించబడుతుంది. ఇది జుట్టు, చర్మం రెండింటికీ ఉపయోగించబడుతుంది. జుట్టు మీద ఎక్కువ సేపు ఇది ఉండటం వల్ల స్కాల్ప్ కు చికాకు కలిగవచ్చు. జుట్టుకు పోషణ, రక్షణకు బదులుగా జుట్టును దెబ్బతీస్తుంది. అందువల్ల పెట్రోలియం కలిగిన హెయిర్ ఉత్పత్తులను వాడకుండా ఉండండి.

పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!


పారాబెన్స్..

జుట్టు సంరక్షణ ఉత్పత్తులలోనే కాకుండా షాంపూలలో పారాబెన్స్ అని పిలువబడే ప్రిజర్వేటివ్‌లు జోడించబడతాయి. ఇవి షాంపూలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించినప్పటికీ ఈస్ట్రోజెన్‌కు హాని చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా జుట్టు రంగు, షైన్‌ను కూడా మసకబారేలా చేస్తుంది.

థాలేట్స్..

థాలేట్స్ అనేది జుట్టు రాలడాన్ని పెంచే, జుట్టు పెరుగుదల సైకిల్ కు ఆటంకం కలిగించే రసాయనం. జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. థాలేట్స్ ఉన్న షాంపూలను ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం.

ఉసిరికాయ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

ఈ 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..!

పండిన అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 03 , 2024 | 10:20 AM