Three Gorges Dam: ఈ డ్యామ్‌తో మనందరికీ ప్రమాదం.. శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక
ABN , Publish Date - Sep 25 , 2024 | 05:07 PM
చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
బీజింగ్: అది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. మూడు నదులు ఒకచోట కలిసే ప్రాంతంలో నిర్మించారు. డ్యాం పూర్తి కావడంతో తమ వద్ద అత్యాధునిక సాంకేతికత, ఇంజినీర్లు ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు. లక్షల ఎకరాల్లో సాగు, తాగు నీరు అందించేలా చేశారు. కానీ.. ఆ డ్యామ్ వల్ల మానవాళి మనుగడే ప్రమాదంగా మారుతుందని గుర్తించలేకపోయారు.
నీటి ఒత్తిడి భరించలేక భూభ్రమనంలో మార్పులు వస్తున్నాయంటే డ్యామ్ ఏ స్థాయి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్(Three Gorges Dam) గురించే ఇదంతా. ఈ డ్యామ్‌తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
సూర్యుడి నుంచి దూరంగా..
చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్ డ్యామ్‌ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు ఆ మధ్య చెప్పారు. దీనికితోడు యాంగ్జీ ప్రభావంతో సూర్యుడి నుంచి భూమి 2 సెంటీమీటర్ల దూరం జరిగిందని వివరించారు.
దీని ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2004లో హిందూ మహా సముద్రంలో సునామీ వచ్చినప్పుడు భూ గమనంలో మార్పు కనిపించింది. భూమిపై భారీగా మార్పులు చోటు జరుగుతున్నప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. భూకంపం ధాటికి రోజు నిడివి సుమారు 2.68 మైక్రోసెకన్లు తగ్గిపోయింది. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్లా భూమి కదలికల్లో అనేక మార్పులు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
3 నదుల నీరు ఒకేచోట..
త్రీ గోర్జెస్ డ్యామ్‌కు మూడు వేర్వేరు నదుల నుంచి నీరు వచ్చి చేరుతోంది. సుమారు 39.3 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటోంది. ఒక్క నది ప్రవాహమే మనకు ప్రళయంలా అనిపిస్తుంటుంది. అలాంటిది మూడు నదులు కలిసే చోట డ్యామ్ నిర్మించారంటే అర్థం చేసుకోవచ్చు భూమిపై ఎంత భారీగా ఒత్తిడి పడుతుందోనని. ఆ స్థాయిలో ఒకేచోట నీరు చేరడం భూమిపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే నిర్మాణాల్లో త్రీ గోర్జెస్ డ్యామ్ ఒకటి.
ఈ డ్యాం కింద 22 వేల 500 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి ఇది సమానమన్నమాట. డ్యామ్‌లో నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యామ్ నిర్మాణం కోసం114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా తరలించింది. 14 లక్షల మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించింది. ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి 203 చైనీస్ యువాన్‌లు ఖర్చు అయింది.1994లో పనులను ప్రారంభించి 2006లో పూర్తి చేశారు.
For Latest News and National News Click here