Share News

Viral Video: కూలిన పర్వతం.. ఆ ఊరి పంట పండింది

ABN , Publish Date - Nov 21 , 2024 | 03:05 PM

Viral Video: నదులు, పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజల జీవితం మిగతా వారి కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో బతికే వీరు ఇతరుల కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రకృతి విలయాలు మాత్రం వీరిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటాయి.

Viral Video: కూలిన పర్వతం.. ఆ ఊరి పంట పండింది

నదులు, పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజల జీవితం మిగతా వారి కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో బతికే వీరు ఇతరుల కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రకృతి విలయాలు మాత్రం వీరిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ ముప్పు వచ్చి పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆ ఊరి వాళ్లకూ అదే భయం. పర్వతానికి దగ్గర్లో ఉండే అక్కడి ప్రజలు పలు ఉత్పాతాలు చూశారు. మళ్లీ ఏది తమ మీదకు వచ్చి పడుతుందోనని వణికిపోయారు. కానీ ఈసారి వాళ్లకు అదృష్టం కలిసొచ్చింది. పర్వతం కూలినా వాళ్ల పంట పండింది. దీంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉంది? అక్కడి వాళ్లు ఎందుకంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


పర్వతం కూలితే పండుగ చేసుకున్నారు

ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఓ పర్వతం కూలిపోయింది. పర్వతం కూలితే పెద్ద విశేషం ఏం ఉంది అనుకోకండి. అది కూలడంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. పర్వతం కూలితే ప్రజలకు ఇబ్బందే కదా! ప్రకృతి విలయంతో వాళ్లు ఎంతో బాధపడి ఉంటారు కదా? మరి పండుగ అంటారే అనేదేగా మీ సందేహం. పర్వతం కూలడంతో అందులో నుంచి విలువైన రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. టన్నుల కొద్దీ రాగి బయటపడటంతో అక్కడి ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


స్థానికులకే సర్వహక్కులు!

పర్వతం కూలుతుండగా చుట్టుపక్కల వందలాది మంది స్థానికులు గుమిగూడటాన్ని వీడియోలో చూడొచ్చు. రాగి నిల్వలు బయటపడగానే విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. కాగా, సాధారణంగా కాంగో అంటే రాగికి బాగా ఫేమస్. అందుకే 1950ల నుంచి అక్కడ కాపర్ మైనింగ్ పెరిగింది. ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో టాప్‌లో ఉండటంతో ఈ పేద దేశంపై బడా దేశాల చూపు పడింది. అందుకే తాజాగా అక్కడ పర్వతం కూలి రాగి నిల్వలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ రాగితో స్థానిక ప్రజలు లాభపడితే బాగుంటుందని.. కానీ బ్రిటీష్, అమెరికా లాంటి దేశాలు అక్కడి వారికి ఆ అవకాశం ఇస్తాయా అని ఎక్స్‌పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సంపద, వనరులపై స్థానికులకే సర్వ హక్కులు ఉన్నాయని.. ఇతరులు దోచుకోవడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు.


Also Read:

రష్యాలో ఏం జరుగుతోంది?

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

1945 దాటి ముందుకు కదలని భద్రతామండలి!

For More International And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 03:11 PM