Share News

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:38 AM

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 112కు చేరిందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్‌లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారన్నారు.

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

ఖాట్మండ్, సెప్టెంబర్ 29: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 112కు చేరిందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్‌లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారన్నారు. వారి కోసం గాలింపు చర్యలు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. దాంతో వివిధ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తడంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయని అన్నారు.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


అలాగే భారీగా కొండ చరియలు సైతం విరిగి పడ్డాయని పేర్కొన్నారు. దాంతో బాధితులుగా మారిన దాదాపు మూడు వేల మందిని పునరావాస కేంద్రాలను తరలించినట్లు వివరించారు. ఇక దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ దాదాపుగా స్తంభించిపోయిందన్నారు. పలు ప్రాంతాల్లోని జాతీయ రహదారులను సైతం మూసివేశారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు


ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వివరించారు. అందులోభాగంగా రహదారులపై భారీగా విరిగి పడిన కొండ చరియల శిథిలాలను తొలగించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇక ఈ భారీ వర్షాల ప్రభావం నేపాల్ రాజధాని ఖాట్మండ్‌ వ్యాలీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

Also Read: Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి


దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అలాగే ఇంటర్నెట్‌ సేవలు సైతం నిలిచిపోయాయిని పేర్కొన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాఫ్టర్ సహయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ భారీ వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బిను మహర్జన్ వెల్లడించారు.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


ఇంకోవైపు పొరుగునున్న భారత్‌లోని బిహార్‌ రాష్ట్రంలో కోసి నది ప్రవహిస్తుందన్నారు. ఈ నది ప్రతి ఏటా భారీ వరదలకు కారణమవుతుందని ఆయన గుర్తు చేశారు. నేపాల్‌లో ఈ నది ప్రస్తుతం ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుందని చెప్పారు. అసలు అయితే నదిలో సాధారణ నీటి ప్రవాహం 150,000 క్యూసెక్కులు ఉండాలన్నారు. కానీ నేడు అది 450,000 క్యూసెక్కుల‌గా ప్రవహిస్తుందని చెప్పారు. అంటే నదిలో నీటి ప్రవహాం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. ఇక భారీ వర్షాలు, వరదలు కారణంగా.. 195 ఇళ్లు దెబ్బతిన్నాయి. గత 40, 45 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఖాట్మాండ్‌లో గతంలో ఎప్పుడు చూడలేదని ఆ నగర వాసి ఈ సందర్బంగా తెలిపారు.

For National News And Telugu News..

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Sep 29 , 2024 | 11:44 AM