Bumper Offer: ఓరి నాయనో.. శృంగారాన్ని ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ..
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:45 PM
Russia Govt Offer: సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా.. విద్య కోసం విద్యాశాఖ.. వైద్యం కోసం ఆరోగ్య శాఖ, ప్రజల రక్షణ కోసం హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. కానీ.. శృంగారాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖను ఎప్పుడైనా చూశారా?
Russia Govt Offer: సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా.. విద్య కోసం విద్యాశాఖ.. వైద్యం కోసం ఆరోగ్య శాఖ, ప్రజల రక్షణ కోసం హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. కానీ.. శృంగారాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖను ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూస్తారు. అవునండీ బాబూ.. యువతీ యువకులను ఒక్కటి చేసింది. దేశంలో కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇది మన దేశంలో కాదండోయ్.. భౌగోళికంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాలో ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నారు. ఇదేం విడ్డూరం.. ఇలాంటి శాఖను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని సందేహిస్తున్నారా? ఇందుకూ బలమైన కారణం చెబుతోంది రష్యా సర్కార్. మరి ఆ రీజన్ ఏంటి? ఎందుకు యువతీయువకుల మధ్య సంబంధాలను ప్రోత్సహిస్తోంది? వంటి వివరాలు తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
దశాబ్దాలుగా రష్యాలో జననాల రేటు అత్యంత దారుణంగా పడిపోయింది. దీంతో రష్యాలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోయి.. యువ సంపద తగ్గింది. ఈ సమస్యను అధిగమించేందుకు రష్యా ప్రభుత్వం సరికొత్త ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా వచ్చిన ప్రతిపాదనే ‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’. అవును.. అక్కడి మీడియా సంస్థల కథనాల ప్రకారం.. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు విధేయురాలు నినా ఒస్టానినా ఓ ప్రతిపాదన చేశారట. జనన రేటును పెంచడానికి ‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’ను స్థాపించాలని సూచించారట. దీనికి పుతిన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రష్యన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. కేవలం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాదండోయ్.. జంటల కోసం దిమ్మతిరిగే ఆఫర్స్ కూడా ఉన్నాయట.
మరి ‘మినిస్ట్రే ఆఫ్ సెక్స్’లో ప్రతిపాదనలు, ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం.. ఈ నిర్ణయం ప్రకారం.. కపుల్స్ అర్థరాత్రి మాత్రమే కాకుండా.. ఆఫీస్ పని వేళల్లోనూ శృంగారంలో పాల్గొనేందుకు సమయం ఇస్తారట. లైట్స్ ఆఫ్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. అంతేకాదు.. ఫస్ట్ డేట్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా అందిస్తారట. ఈ జంటకు 5,000 రూబీస్ ఇస్తారట.
రష్యన్ గవర్నమెంట్ ప్రతిపాదనలు ఓసారి చూద్దాం..
పెళ్లి-రాత్రి హోటల్ బస: కొత్తగా పెళ్లైన జంటకు వారి మొదటి రాత్రి కోసం హోటల్ బుకింగ్ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది.
డబ్బు బహుమతి: మొదటి కాన్పులో జన్మించిన బిడ్డలకు 8,500 పౌండ్లు అందించనున్నారు. ఇప్పటికే రాష్యాలోని కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇక 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు గల మహిళా విద్యార్థులకు 900 పౌండ్లు ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని యోచిస్తున్నారు.
లైట్లు మరియు ఇంటర్నెట్ ఆఫ్ చేయడం: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు రాత్రి పడుకునే ముందు ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడుతుంటారు. ఫోన్‌లోనే నిమగ్నమవుతారు. దీనిని నివారించి.. భార్య, భర్తల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. దంపతులు శృంగార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా పవర్ సప్లై కూడా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు: ఇంటి పనుల కోసం మహిళలు ఇంట్లోనే ఉండేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారికి ఆర్థిక అండగా నిలిచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలని భావిస్తోంది.
మహిళలను విచిత్ర ప్రశ్నలు అడుగుతోన్న రష్యా ప్రభుత్వం..
ఏ పథకం అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పాటు.. మహిళల వ్యక్తిగత జీవితాలను, అభిరుచులను కూడా అధ్యయనం చేస్తోంది రష్యా ప్రభుత్వం. దేశంలో జననాల రేటును పెంచే కసర్తతులో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, వారి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి పలు ప్రశ్నలు సంధిస్తోంది. వాటికి సమాధానం చెప్పాలని కోరుతోంది.
రష్యా మీడియా నివేదికల ప్రకారం కొన్ని ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి..
మీరు లైంగిక కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించారు?
మీరు జనన నియంత్రణ కోసం కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారా?
మీరు సంభోగం సమయంలో నొప్పి లేదా రక్తస్రావం అనుభవిస్తున్నారా?
మీరు గర్భవతిగా ఉన్నారా, అలా అయితే, ఎన్ని సార్లు?
మీకు పిల్లలు ఉన్నారా లేదా రాబోయే సంవత్సరంలో ఎక్కువ మందిని కనాలనుకుంటున్నారా?
జననాల రేటును పెంచడానికి రష్యా ‘పిల్లల రహిత ప్రచారాన్ని’ నిషేధించింది..
క్షీణిస్తున్న జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో.. ‘పిల్లల రహిత జీవన విధానం’ కోసం చేస్తున్న ప్రచారాన్ని రష్యా ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయానికి రష్యా దిగువ సభ మంగళవారం ఏకగ్రీవంగా ఓటు వేసింది. సెప్టెంబరులో విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం ఉధృతంగా సాగుతున్నందున మరణాల రేట్లు పెరిగింది. అదే సమయంలో జనన రేటు కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనిపై రష్యా ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జననాల రేటును పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది సర్కార్.
Also Read:
మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
వైద్యుడిపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో
ఆ కేసులో ధోనీకి హైకోర్టు నోటీసులు..
For More International News and Telugu News..