Jeffrey Epstein Files: సంచలనం రేకెత్తిస్తున్న లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టెయిన్
ABN , Publish Date - Jan 04 , 2024 | 02:05 PM
అమెరికాలో పేరు మోసిన లైంగిక నేరస్థుడు ‘జెఫ్రీ ఎప్‌స్టెయిన్’ (Jeffrey Epstein Files) కోర్టుకు తెలియజేసిన సమాచారంలో తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన పత్రాలను న్యూయార్క్ జడ్జి తెరవడంతో అమెరికాకు చెందిన పలువురు హైప్రొఫైల్ వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి.
న్యూఢిల్లీ: అమెరికాలో పేరు మోసిన లైంగిక నేరస్థుడు ‘జెఫ్రీ ఎప్‌స్టెయిన్’ (Jeffrey Epstein Files) కోర్టుకు తెలియజేసిన సమాచారంలో తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన పత్రాలను న్యూయార్క్ జడ్జి తెరవడంతో అమెరికాకు చెందిన పలువురు హైప్రొఫైల్ వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి. సెక్స్ కుంభకోణానికి (Sex Scandar) సంబంధించిన ఈ కేసులో దాదాపు 1000 పేజీల స్టేట్‌మెంట్‌లో గతంలో వెల్లడించని చాలామంది ప్రముఖుల పేర్లు, వివరాలు బయటకొచ్చాయి.
అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ వంటి అనేకమంది అత్యున్నత స్థాయి వ్యక్తుల పేర్లు ఉండడం కలకలం రేపుతోంది. బుధవారం విడుదల చేసిన మొదటి విడత అన్‌సీల్డ్ డాక్యుమెంట్లలో వ్యాపారస్థుల నుంచి రాజకీయ నాయకుల వరకు, పలు రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కాగా సెక్స్ కుంభకోణంలో దాదాపు 200 మంది పేర్లు బయటపడతాయనేది అంచనాగా ఉంది. కాగా తాజాగా బయటపడిన పత్రాల్లో అధికంగా వార్తా పత్రికలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. ఎప్‌స్టెయిన్‌కు చెందిన విమానంలో బిల్ క్లింటన్ ప్రయాణించినట్టు ఓపెన్ చేసిన పత్రాల్లో బయటపడింది.