Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు.. కదిలిన మోదీ సర్కార్
ABN , Publish Date - Jul 25 , 2024 | 04:05 PM
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థానిక లుటియన్స్ ప్రాంతం.. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్‌లో బంగ్లా నెం1ను ఆప్‌కి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జులై 25: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థానిక లుటియన్స్ ప్రాంతంలోని పండిట్ రవి శంకర్ శుక్లా లేన్‌లో బంగ్లా నెం1ను ఆప్‌కి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆప్ వర్గాలు గురువారం వెల్లడించాయి. అయితే ఆప్ జాతీయ పార్టీ అని.. ఆ పార్టీకి నూతన కార్యాలయం కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆ పార్టీ నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Maharastra: ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇటీవల స్పందించింది. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీకి కొత్త కార్యాలయం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే జులై 25వ తేదీలోగా ఆప్‌కి కొత్త కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి గడువు విధించింది. దీంతో ఆప్‌కు కేంద్రం కొత్త కార్యాలయాన్ని కేటాయించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటి వరకు రౌస్ అవెన్యూలో కార్యాలయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మని లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. కేజ్రీవాల్‌ను తీహాడ్ జైల్లోనే అంతమొందించేందుకు అటు బీజేపీ, ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అలాంటి వేళ.. తీహాడ్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఇటీవల నివేదిక విడుదల చేశారు. మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్‌తో జైలుకెళ్లిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే. అయితే అప్పటికే ఆయన్ని ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దాంతో ఈడీ అరెస్ట్‌లో బెయిల్ వచ్చినా.. సీబీఐ అరెస్ట్‌తో మళ్లీ కేజ్రీవాల్ జైలుకే పరిమితమయ్యారు. అలాంటి వేళ.. కేజ్రీవాల్ పట్ల ఓ విధమైన ద్వేష భావంతో వ్యవహారిస్తుందని మోదీ ప్రభుత్వంపై ఆప్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Latest AP News and Telugu News